పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను నవంబరు 28 నుంచి డిసెంబరు 6వ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ క్రమంలో తిరుచానూరులో అమ్మవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను టీటీడీ ఈవో శ్యామలరావు పరిశీలించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే (సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే 2024) విజయవంతంగా సాగుతోంది. అన్ని వర్గాల సంక్షేమం, సామాజిక సాధికారత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ సర్వే దేశమందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నవంబర్ 6న ప్రారంభమైన ఈ సర్వే.. 12 రోజుల్లోనే సగానికిపైగా పూర్తయింది. ఆదివారం (నవంబర్ 17) నాటికి 58.3% సర్వే పూర్తయింది.
Mahbubnagar: మహబూబాబాద్ జిల్లా ల్లోని లోక్ సభ స్థానం ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 20 రోజులు ఉత్కంఠకు రేపటితో తెరపడనుంది. మహబూబాబాద్ లోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాలలో జరిగే..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ సీజన్ ఈ నెల 21న ప్రారంభమైన విషయం తెలిసిందే.. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు జరిగాయి. లోక్‌సభ ఎన్నికల కారణంగా తొలి 21 మ్యాచ్‌ల షెడ్యూల్ మాత్రమే విడుదలైంది. ఈ నేపథ్యంలో మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో.. బీసీసీఐ (BCCI) ఐపీఎల్ 2024 మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేసింద
ఢిల్లీ ఈడీ కార్యాలయంలో కవిత మొదటి రోజు విచారణ పూర్తి అయింది. విచారణ సందర్భంగా ఈడీ అధికారులు వీడియో రికార్డింగ్ చేశారు. విచారణ తర్వాత కవితను ఆమె భర్త అనిల్, సోదరుడు కేటీఆర్, బావ హరీశ్ రావు కలిశారు. కవిత యోగ, క్షేమాలను వీరు కనుక్కున్నారు. ఈ కేసులో న్యాయపోరాటం చేద్దామని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా న్యాయవాది మోహిత్ రావు కూడా కవితను కలిశారు. ఇదిలా ఉంటే.. రేపు సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత భర్త కంటెంప్ట్…
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ ముగిసింది. యశోదా హాస్పిటల్ లో కేసీఆర్ కు హిప్ రీప్లేస్ మెంట్ సర్జరీ చేశారు. నాలుగు గంటలకు పైగా కేసీఆర్ కు డాక్టర్లు సర్జరీ చేశారు. యశోద డాక్టర్ల ఆధ్వర్యంలో కేసీఆర్ తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతంగా ముగిసింది .ఈ క్రమంలో.. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై మరికాసేపట్లో యశోదా హాస్పిటల్ హెల్త్ బులిటెన్ విడుదల చేయనుంది.
ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో విశాఖ శ్రీ శారదాపీఠం చేపట్టిన రాజశ్యామలా సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం ముగిసింది. వైదిక నియమాలను అనుసరిస్తూ మూడు రోజులపాటు యాగాన్ని నిర్వహించారు. శుక్రవారం మధ్యాహ్నం మహా పూర్ణాహుతితో యాగ క్రతువు పూర్తయింది.