సమగ్ర కుటుంబ(ఆర్థిక, రాజకీయ, విద్య, సామాజిక, న్యాయ) సర్వేను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అధ్యయనానికి సామాజికవేత్తలతో స్వతంత్ర హోదాతో కమిటీ ఏర్పాటు చేసినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. సమగ్ర సర్వే సమాచారాన్ని విశ్లేషణ చేసి చిన్న పొరపాటుకు అవకాశం లేకుండా మేధావులు, సామాజిక శాస్త్రవేత్తలు కృషి చేయాలని కోరారు.
Samagra Kutumba Survey: దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రస్తుతానికి 15 జిల్లాల్లో నూటికి నూరు శాతం పూర్తయింది. సామాజిక సాధికారత లక్ష్యంగా అన్ని వర్గాలకు సమానమైన అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ బృహత్తర ప్రయత్నం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇకపోతే, ఇప్పటివరకు రాష్ట్రంలో 94.9 శాతం సర్వే పూర్తయింది. నవంబర్ 6వ తేదీన మొదలైన ఈ సర్వే ద్వారా 27 రోజుల్లో 1,11,49,488…
Bhatti Vikramarka: సమగ్ర సర్వేలో డేటా ఎంట్రీ దశ చాలా ముఖ్యమైందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాంచీ నుంచి ఉన్నతాధికారులు, కలెక్టర్లతో సమగ్ర కుటుంబ సర్వేపై వీడియో కాన్ఫరెన్స్ లో భట్టి విక్రమార్క మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే (సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే 2024) విజయవంతంగా సాగుతోంది. అన్ని వర్గాల సంక్షేమం, సామాజిక సాధికారత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ సర్వే దేశమందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నవంబర్ 6న ప్రారంభమైన ఈ సర్వే.. 12 రోజుల్లోనే సగానికిపైగా పూర్తయింది. ఆదివారం (నవంబర్ 17) నాటికి 58.3% సర్వే పూర్తయింది.
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే సమన్వయ, పర్యవేక్షణ అధికారులను నియమించింది ప్రభుత్వం. జీహెచ్ఎంసీ పరిధిలో సర్వే సమన్వయ అధికారిగా హెచ్‌ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌ను నియమించారు. సికింద్రాబాద్, చార్మినార్ జోన్‌లకు హెచ్‌ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ శ్రీవత్స కోట.. ఎల్బీనగర్, ఖైరతాబాద్ జోన్‌లకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ఉప కార్యదర్శి ప్రియాంక.. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి జోన్‌లకు జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మయాంక్ మిట్టల్‌ను నియమించారు.
Samagra Kutumba Survey: రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వేలో నేడు అసలు ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి దశలో (బుధవారం) నుంచి మూడు రోజులుగా కుటుంబాలను గుర్తించి సిబ్బంది ఇళ్లకు ఎన్యూమరేటర్లు స్టిక్కర్లు వేశారు.