Puspa 2 Trailer: ఊహించిన దానికంటే మించి ఉంటుంది: రష్మిక మందన్న
- బీహార్ లోని పాట్నా వేదికగా
- పుష్ప 2 సినిమా ట్రైలర్ రిలీజ్
- ఊహించిన దానికంటే మించి ఉంటుందంటున్న హీరోయిన్ రష్మిక మందన్న
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Puspa 2 Trailer: బీహార్ లోని పాట్నా వేదికగా పుష్ప 2 సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుక నేడు జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దెత్తున అల్లు అర్జున్ అభిమానులు హాజరయ్యారు. పాట్నాలోని గాంధీ మైదాన్ లో అభుమానుల కోలాహలం మాములుగా లేదు. పుష్ప.. పుష్ప.. అంటూ వేడుకను హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో భాగంగా హీరోయిన్ రష్మిక మందన్న మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం తెలుపుతూ, ఇంతటి ప్రేమను అందించిన పాట్నా ప్రజలందరికీ నా ధన్యవాదాలని చెప్పింది. నేను పుష్ప శ్రీవల్లి. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి మీ అందరిని ఎంతో ప్రేమగా ఆహ్వానిస్తున్నాని.. ఈ చిత్రం రెండు సంవత్సరాల మీ ఎదురుచూపులకు కచ్చితంగా మీరు ఊహించిన దానికి మించి ఉంటుంది అని నేను చెప్పగలనంది. ఇంతమంది అభిమానులు పుష్ప ప్రపంచంలోకి రావడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని, ఈ చిత్రం ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నట్లు రష్మిక అంది. డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని మీరు మీ కుటుంబ సభ్యులతో, మిత్రులతో కలిసి చూడాలని నేను కోరుకుంటున్నాని ఆవిడ మాట్లాడారు.
Also Read: Womens Asian Champions Trophy: లీగ్ దశలో జపాన్‌ను ఓడించి అగ్రస్థానంతో సెమీఫైనల్‌కు చేరుకున్న భారత్
Also Read
ఈ కార్యక్రంలో భాగంగా బీహార్ డిప్యూటీ సీఎం విజయ్ సేన సాహెబ్ మాట్లాడుతూ.. పుష్ప 2 ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని బీహార్ లోని పాట్నాలో నిర్వహించడం నాకు ఎంత సంతోషంగా ఉందని ఆయన అన్నారు. బీహార్ ప్రభుత్వం తరఫున, అలాగే ముఖ్యమంత్రి తరపున చిత్ర బృందానికి మా కృతజ్ఞతలు అందజేస్తున్నట్లు ఆయన మట్లాడారు. అలాగే ఈ కార్యక్రమం ఇలా విజయం సాధించడానికి తోడ్పడిన పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. అభిమానులు అందరూ కలను, కళాకారులను సపోర్ట్ చేసేవారు కావడం సంతోషకరం అని ఆయన అన్నారు. ఎవరైనా మా రాష్ట్రానికి అతిథిగా వచ్చినప్పుడు వారికి మా ప్రేమానురాగాలు చూపించడంలో ముందుంటామని, ఈ చిత్ర బృందానికి, ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులకు అందరికీ నా ధన్యవాదాలని ఆయన అన్నారు.
Also Read: Puspa 2 Trailer: పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఇకనుండి వైల్డ్ ఫైర్ అంటున్న ఐకాన్ స్టార్
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు