Salman Ali Agha: ఏంట్రా బాబు ఆ మాట్లాడడం.. నవ్వులపాలైన పాకిస్తాన్ కెప్టెన్! వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Salman Ali Agha: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా కొలంబోలో జరిగిన భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్-Aకి చెందిన ఈ కీలక మ్యాచ్‌లో భారత్ 61 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 175 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యచేదనకు దిగిన పాకిస్తాన్ జట్టు 18 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌట్ అయింది.
Also Read
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ఇక ఈ విజయం తర్వాత భారత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. జట్టు ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశాడు. జట్టు అనుకున్న విధంగానే మ్యాచ్ ఆడిందని తెలిపాడు. ముఖ్యంగా ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్‌ను ప్రశంసిస్తూ, క్లిష్ట పరిస్థితుల్లో బాధ్యతగా ఆడాడని అన్నాడు. తిలక్ వర్మ, శివం దూబే, రింకూ సింగ్ ఇచ్చిన సహకారం కూడా జట్టుకు బలం చేకూర్చిందని అన్నాడు. ఇంకా బౌలింగ్ విభాగంలో హార్దిక్ పాండ్య కొత్త బంతితో కీలక పాత్ర పోషించగా, జస్ప్రీత్ బుమ్రా తన అనుభవాన్ని చూపించాడని అన్నాడు.
ఇంకా ఈ మ్యాచ్‌లో అద్భుతంగా ఆడి మ్యాన్ అఫ్ ది మ్యాచ్ గెలుచుకున్న ఇషాన్ కిషన్ మాట్లాడుతూ.. “పిచ్ అంత సులభంగా లేదని, కానీ తన బలాలపై నమ్మకం పెట్టుకుని ఆడానని” అన్నాడు. పెద్ద మైదానంలో గ్యాప్ లను ఉపయోగించి పరుగులు సాధించేందుకు ప్రయత్నించానని తెలిపాడు. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడూ ప్రత్యేకమని.. ఈ విజయం జట్టుకు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని అన్నాడు.
Rajasthan: భివాడి కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఏడుగురు సజీవదహనం
ఇక పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. జట్టు బ్యాటింగ్ ప్రారంభం సరిగా లేదని ఒప్పుకున్నాడు. పవర్ ప్లేలో వికెట్లు వరుసగా కోల్పోవడం వల్ల మ్యాచ్‌పై పట్టును కోల్పోయామని అన్నాడు. నాలుగు స్పిన్నర్లతో ఆడినప్పటికీ అమలు లోపించిందని వారి ఆటను చెప్పుకొచ్చాడు. ఇలాంటి భావోద్వేగాలు ఎక్కువగా ఉండే మ్యాచ్‌లలో వాటిని నియంత్రించాల్సిన అవసరం ఉందని కూడా పేర్కొన్నాడు. అయితే అక్కడ కామెంటేటర్ అడిగిన ప్రశ్నలకు పాకిస్తాన్ కెప్టెన్ జవాబు ఇచ్చిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో అతడు మాట్లాడిన తీరు క్రికెట్ అభిమానుల్లో నవ్వులు పూయిస్తుంది. ఈ విజయంతో భారత్ గ్రూప్ దశలో తన ఆధిపత్యాన్ని కొనసాగించగా.. పాకిస్తాన్ తదుపరి మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దీనెమ్మ ఏం ఫీల్ ఉందిరా మామ 🤣🤣🤣 pic.twitter.com/baM2tw1qDV
— JSP Naresh (@JspBVMNaresh) February 16, 2026
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!