Salman Ali Agha: ఏంట్రా బాబు ఆ మాట్లాడడం.. నవ్వులపాలైన పాకిస్తాన్ కెప్టెన్! వీడియో వైరల్..

Salman Ali Agha

Salman Ali Agha

Salman Ali Agha: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా కొలంబోలో జరిగిన భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్-Aకి చెందిన ఈ కీలక మ్యాచ్‌లో భారత్ 61 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 175 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యచేదనకు దిగిన పాకిస్తాన్ జట్టు 18 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌట్ అయింది.

10,000 కంటే ఎక్కువ యాప్స్, అల్ట్రా HD డిస్‌ప్లే ఉన్న Sony BRAVIA 3 Series Google టీవీపై రూ.49,900 భారీ డిస్కౌంట్!

ఇక ఈ విజయం తర్వాత భారత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. జట్టు ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశాడు. జట్టు అనుకున్న విధంగానే మ్యాచ్ ఆడిందని తెలిపాడు. ముఖ్యంగా ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్‌ను ప్రశంసిస్తూ, క్లిష్ట పరిస్థితుల్లో బాధ్యతగా ఆడాడని అన్నాడు. తిలక్ వర్మ, శివం దూబే, రింకూ సింగ్ ఇచ్చిన సహకారం కూడా జట్టుకు బలం చేకూర్చిందని అన్నాడు. ఇంకా బౌలింగ్ విభాగంలో హార్దిక్ పాండ్య కొత్త బంతితో కీలక పాత్ర పోషించగా, జస్ప్రీత్ బుమ్రా తన అనుభవాన్ని చూపించాడని అన్నాడు.

ఇంకా ఈ మ్యాచ్‌లో అద్భుతంగా ఆడి మ్యాన్ అఫ్ ది మ్యాచ్ గెలుచుకున్న ఇషాన్ కిషన్ మాట్లాడుతూ.. “పిచ్ అంత సులభంగా లేదని, కానీ తన బలాలపై నమ్మకం పెట్టుకుని ఆడానని” అన్నాడు. పెద్ద మైదానంలో గ్యాప్‌ లను ఉపయోగించి పరుగులు సాధించేందుకు ప్రయత్నించానని తెలిపాడు. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడూ ప్రత్యేకమని.. ఈ విజయం జట్టుకు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని అన్నాడు.

Rajasthan: భివాడి కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఏడుగురు సజీవదహనం

ఇక పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. జట్టు బ్యాటింగ్ ప్రారంభం సరిగా లేదని ఒప్పుకున్నాడు. పవర్‌ ప్లేలో వికెట్లు వరుసగా కోల్పోవడం వల్ల మ్యాచ్‌పై పట్టును కోల్పోయామని అన్నాడు. నాలుగు స్పిన్నర్లతో ఆడినప్పటికీ అమలు లోపించిందని వారి ఆటను చెప్పుకొచ్చాడు. ఇలాంటి భావోద్వేగాలు ఎక్కువగా ఉండే మ్యాచ్‌లలో వాటిని నియంత్రించాల్సిన అవసరం ఉందని కూడా పేర్కొన్నాడు. అయితే అక్కడ కామెంటేటర్ అడిగిన ప్రశ్నలకు పాకిస్తాన్ కెప్టెన్ జవాబు ఇచ్చిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో అతడు మాట్లాడిన తీరు క్రికెట్ అభిమానుల్లో నవ్వులు పూయిస్తుంది. ఈ విజయంతో భారత్ గ్రూప్ దశలో తన ఆధిపత్యాన్ని కొనసాగించగా.. పాకిస్తాన్ తదుపరి మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.