Sakshi Instagram post to Rishabh Pant: ఆదివారం విశాఖలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ధనాధన్ షాట్లతో అలరించాడు. వింటేజ్ తలాను గుర్తుచేస్తూ.. విశాఖ స్టేడియాన్ని హోరెత్తించాడు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోనీ.. 16 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో 37 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2024లో ధోనీ తొలిసారి బ్యాటింగ్ చేయడం, భారీ షాట్లు ఆడడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
ఎంఎస్ ధోనీ ధనాధన్ బ్యాటింగ్ చూసి అతడి సతీమణి సాక్షి మైదానంలో కేరింతలు కొట్టారు. ఇక ‘ఎలక్ట్రిక్ స్ట్రైకర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును మహీ అందుకున్నపుడు విశాఖ స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. ఆ సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టే గెలిచిందేమో అన్న అనుమానం కలిగింది. ధోనీ బ్యాటింగ్ చూసి అందరూ చెన్నై మ్యాచ్ ఓడిందనే విషయాన్ని మర్చిపోయారు. ఇదే భావన తనకు కలిగిందని సాక్షి సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
Also Read: Sri Lanka Record: శ్రీలంక టీమ్ అరుదైన ఘనత.. 48 ఏళ్ల భారత్ రికార్డు బ్రేక్!
‘హాయ్ మహీ.. ఉన్నావా?. నీ బ్యాటింగ్ చూసి.. గేమ్‌లో ఓడిపోయామని గ్రహించలేదు’ అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ పోస్టుకు ఎంఎస్ ధోనీ అవార్డు స్వీకరిస్తున్న ఫొటోను జత చేసిన సాక్షి.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్‌ను ట్యాగ్ చేశారు. ఈ పోస్ట్ నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఇక ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే 20 పరుగులతో ఢిల్లీపై ఓడింది. ముందుగా ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసి ఓడిపోయింది.