Sajjala Ramakrishna Reddy: విచారణకు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరు.. పీఎస్‌ వద్ద భారీ భద్రత

  • మంగళగిరి పోలీస్‌స్టేషన్‌కు సజ్జల రామకృష్ణారెడ్డి
  • టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో విచారణకు హాజరు
  • మంగళగిరి పోలీస్‌స్టేషన్ దగ్గర భారీ భద్రత
  • టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో నిన్న సజ్జలకు నోటీసులు
Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy: మంగళగిరి పోలీస్‌స్టేషన్‌ వద్దకు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చేరుకున్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సజ్జల రామకృష్ణా రెడ్డి విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో సజ్జలను పోలీసులు ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. మంగళగిరి పోలీస్‌స్టేషన్ దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు. పోలీసు స్టేషన్‌ ప్రాంగణంలోకి బయట వ్యక్తులు రాకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సజ్జల వెంట మాజీ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి వచ్చారు. పొన్నవోలును పోలీస్‌ స్టేషన్‌లోకి పోలీసులు అనుమతించలేదు. సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే పోలీస్ స్టేషన్‌లోకి వెళ్లారు. అయితే ఈ కేసుకు సంబంధించి 120వ నిందితుడిగా సజ్జల రామకృష్ణారెడ్డి పేరును చేర్చారు. దీనికి సంబంధించి బుధవారం సజ్జల రామకృష్ణా రెడ్డికి నోటీసులు అందాయి. ఆ నోటీసుల్లో సజ్జల ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే సజ్జల రామకృష్ణారెడ్డి విచారణకు హాజరయ్యారు.

Read Also: Minister Atchannaidu: కౌలు రైతుల రుణాలపై సమీక్ష.. లోన్స్ మంజూరుపై చర్చ