లేడీ అఘోరీగా చలామణి అవుతున్న అలియాస్ అల్లూరి శ్రీనివాస్ అనే వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఓ వ్యక్తి... తన కూతురు శ్రీ వర్షిణికి మాయమాటలు చెప్పి తీసుకెళ్లి పోయాడని గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన తురిమెల్ల కోటయ్య.. మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
మంగళగిరి పోలీస్‌స్టేషన్ వద్దకు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చేరుకున్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సజ్జల రామకృష్ణా రెడ్డి విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో సజ్జలను పోలీసులు ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. మంగళగిరి పోలీస్‌స్టేషన్ దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో టీడీపీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు దాడి చేసిన నేపథ్యంలో.. ఇవాళ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది తెలుగుదేశం పార్టీ.. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. టీడీపీ నేతలపైనే కేసు నమోదు చేశారు మంగళగిరి పోలీసులు.. టీడీపీ కార్యాలయానికి వచ్చిన సీఐ నాయక్ పై దాడి చేశారంటూ మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.. ఈ కేసులో.. ఏ1గా నారా లోకేష్, ఏ2గా అశోక్ బాబు, ఏ3గా ఆలపాటి…