Sajjala Ramakrishna Reddy: తల్లి ఆరోగ్యం బాగాలేకపోతే నాటకాలు అంటూ ప్రచారం చేస్తారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sajjala Ramakrishna Reddy: కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విషయంలో ఓ వర్గం మీడియా తప్పుడు ప్రచారం చేస్తుందని ఏపీ ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి మంగళవారంనాడు తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. తల్లి ఆరోగ్యం బాగా లేకపోతే నాటకాలు అంటూ ప్రచారం చేస్తారా అని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇప్పటికే ఆరు దఫాలు సీబీఐ విచారణకు హాజరయ్యారన్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐకి సహకరిస్తున్నారని సజ్జల వెల్లడించారు. వైఎస్ అవినాష్ రెడ్డి విషయంలో అనవసర కథనాలు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆయన ఓ వర్గం మీడియాపై మండిపడ్డారు. అవినాష్ రెడ్డి విషయంలో కూడా రోత రాతలు రాస్తున్నారని ఆయన విమర్శించారు. అవినాష్ రెడ్డి అంశం కోర్టు పరిధిలో ఉందన్నారు. అవినాష్ రెడ్డి పై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.
Read Also: SI Suspend: మోసం చేశాడంటూ ఎస్సైపై యువతి ఫిర్యాదు.. ఆ అధికారిపై సస్పెన్షన్ వేటు
Also Read
- Supreme Court: ‘సైబర్ నేరగాళ్లు పరాన్నజీవులు’’.. నిందితులు జైల్లో ఉండడమే ఉత్తమమన్న సూర్యకాంత్
- Tea and Biscuits: ఖాళీ కడుపుతో టీ, బిస్కెట్లు తింటున్నారా..? ఎయిమ్స్ వైద్యుల కీలక హెచ్చరిక
- INDA Vs AFGA: ఫైనల్లోకి దూసుకెళ్లిన టీమిండియా.. ఆప్ఘనిస్థాన్‌పై భారీ విజయం..
- G7 Summit: ఉక్రెయిన్‌కు పెరిగిన సైనిక, ఇంధన మద్దతు.. రష్యాపై ఆంక్షలకు జీ7 దేశాలు గ్రీన్‌సిగ్నల్
సీఎం జగన్ పాలనను చూసి విపక్షాలు కడుపుమంటతో రగిలిపోతున్నాయని నాలుగేళ్లుగా ప్రజలకు ఇచ్చిన హామీల్లో 98.5 శాతం నెరవేర్చినట్టుగా ఆయన చెప్పారు. రాష్ట్రానికి మంచి జరిగితే ప్రతిపక్షాలు కడుపు మంటతో రగిలిపోతున్నాయని పేర్కొన్నారు. న్యాయంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు విడుదల అయ్యాయని.. ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారనే ప్రశ్నలకు ఇది ఒక సమాధానమన్నారు. బీజేపీతో పార్టనర్‌గా ఉండి కూడా చంద్రబాబు ఏమీ చేయలేదన్నారు. తన వ్యక్తిగత పనులకు వాడుకున్నారే తప్ప రాష్ట్రానికి ఉపయోగపడే పని చేయలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. తమ ప్రభుత్వంపై ఓ మీడియా వర్గం దుష్ప్రచారం చేస్తుందని ఆయన విమర్శించారు. మచిలీపట్నం పోర్టు శంఖుస్థాపన కీలకమైన ప్రాజెక్టు అని.. ఇటువంటి అంశాలపై చర్చ చేయరని.. రాష్ట్రంలో ఏదో జరిగి పోతుందని భ్రమ కల్పిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏపీ పాలనను మెచ్చుకుంటున్నాయని ఆయన గుర్తు చేశారు.
తాజావార్తలు
-
Supreme Court: ‘సైబర్ నేరగాళ్లు పరాన్నజీవులు’’.. నిందితులు జైల్లో ఉండడమే ఉత్తమమన్న సూర్యకాంత్
-
Tea and Biscuits: ఖాళీ కడుపుతో టీ, బిస్కెట్లు తింటున్నారా..? ఎయిమ్స్ వైద్యుల కీలక హెచ్చరిక
-
INDA Vs AFGA: ఫైనల్లోకి దూసుకెళ్లిన టీమిండియా.. ఆప్ఘనిస్థాన్‌పై భారీ విజయం..
-
G7 Summit: ఉక్రెయిన్‌కు పెరిగిన సైనిక, ఇంధన మద్దతు.. రష్యాపై ఆంక్షలకు జీ7 దేశాలు గ్రీన్‌సిగ్నల్
-
Anil Ravipudi: రేపే అనిల్ రావిపూడి కొత్త సినిమా గ్రాండ్ లాంచ్!
ట్రెండింగ్
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్‌పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!