టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ సైంధవ్. హిట్ ఫేం శైలేష్ కొలను ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సైంధవ్ వెంకటేష్ 75వ సినిమాగా యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కుతోంది.సైంధవ్ సినిమా 2024 జనవరి 13న సంక్రాంతి కానుకగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో సైంధవ్ టీం వరుసగా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగిస్తుంది.ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదల చేసిన పాటలు మ్యూజిక్ లవర్స్ ను ఎంతగానో ఇంప్రెస్ చేస్తున్నాయి.చంద్రప్రస్థ ఫిక్షనల్ పోర్ట్ ఏరియా బ్యాక్‌డ్రాప్ మిషన్ నేపథ్యంలో సాగుతున్న సైంధవ్‌లో జెర్సీ ఫేం శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది..
బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆర్య, రుహానీ శర్మ మరియు ఆండ్రియా జెర్మియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. నవాజుద్దీన్ సిద్దిఖీ ఈ మూవీ తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ లో వెంకీ మామా విశ్వరూపం చూపించాడు. ప్రస్తుతం సైంధవ్ ట్రైలర్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.ఇదిలా ఉంటే వైజాగ్‌లోని ఆర్‌కె బీచ్‌లోని గోకుల్ పార్క్‌లో నేడు (జనవరి 7 ) న సాయంత్రం 07:00 గంటలకి ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. ఈ ఈవెంట్ చిత్ర యూనిట్ అంతా హాజరు అయ్యారు.ఈ ఈవెంట్ డైరెక్టర్ సైలేష్ కొలను మాట్లాడుతూ వెంకటేష్ గారి 75 వ సినిమా భాద్యత నాకు ఇచ్చినందుకు ఎంతో ఆనందంగా వుంది. ఈ సినిమాలో సరికొత్త వెంకీ మామ ను చూస్తారు. నేను చిన్నప్పటి నుండి కమల్ హాసన్ గారి వీరాభిమానిని సైంధవ్ సినిమాతో వెంకీ మామ ఫ్యాన్ అయిపోయా.. ఇప్పటి నుండి వెంకటేష్ గారి ప్రతి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తాను అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.