Sai Pallavi : సాయి పల్లవి.. దక్షిణ చిత్ర పరిశ్రమలలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈ న్యాచురల్ బ్యూటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. కేవలం నటనకు ప్రాముఖ్యత ఉన్న పాత్రను మాత్రమే ఎంచుకుంటూ తనదైన సహజ నటనతో అభిమానులను పెద్ద ఎత్తున సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమె తన డాక్టర్ చదువును కొనసాగిస్తూనే.. మరోవైపు సినిమాలలో హీరోయిన్ గా నటిస్తూ స్టార్డం అందుకుంది. ప్రేమమ్ అనే మలయాళం సినిమా ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఆవిడ తర్వాత.. ఫిదా సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన మొదటి సినిమాతోనే అందం, చలాకితనంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది. ఆపై ఖచ్చితంగా పాత్రకు అవకాశం ఉన్న సినిమాలను ఎంచుకుంటూ సినీ ఇండస్ట్రీలలో టాప్ హీరోయిన్ గా కొనసాగింది. ముఖ్యంగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఆమెకు లేడీ మెగాస్టార్ అని పేరును కూడా సంబోధిస్తున్నారు ఈ మధ్యకాలంలో.
Rajtarun : తిరగబడరసామీ థియేట్రికల్ రిలీజ్ డేట్ వచ్చేసింది..
ఇకపోతే ప్రతి ఒక్క నటుడికి వారి జీవితంలో ఒక డ్రీమ్ రోల్ చేయాలని ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే తాజాగా ఓ యాంకర్ సాయి పల్లవిని మీ డ్రీమ్ రోల్ ఏంటి అని అడిగింది. దాంతో సాయి పల్లవి ఏమాత్రం తడబడకుండా.. తనకి కామియో రోల్ అంటే చాలా ఇష్టమని., తాను సినిమాలో పూర్తిస్థాయిలో ప్రేక్షకులను నవ్వించాలని., అలాగే హీరోయిన్ మాత్రమే కాకుండా లేడీ కమెడియన్ కూడా అనిపించుకోవాలని., అలాంటి పాత్ర ఒక్కటి వచ్చినా చాలు తాను నటిస్తానంటూ తన డ్రీమ్ రోల్ గురించి ఓపెన్ అయిపోయింది సాయి పల్లవి. దీంతో ప్రస్తుతం ఈ విషయం తెలుసుకున్న ఆవిడ అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా సాయి పల్లవి తన ప్రస్థానాన్ని మొదలుపెట్టింది. బాలీవుడ్ టాప్ హీరో రన్ వీర్ కపూర్ తో రామాయణం సినిమా చేస్తోంది. ఇందులో సీత పాత్రలో సాయి పల్లవి నటించిననుంది.
Kisan Vikas Patra : 115 నెలల్లో మీ డబ్బు రెట్టింపు.. వివరాలు ఇలా..