Sai Krishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. పిటిషన్ ఉపసంహరణపై హైకోర్టు సీరియస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sai Krishna Custodial Death Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన సాయికృష్ణ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. హెబియస్ కార్పస్ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో విచారణలో కొత్త మలుపు తిరిగింది. ఇదే పిటిషన్లో సీబీఐ విచారణ కోరిన పిటిషన్‌ను కూడా వెనక్కి తీసుకుంటున్నట్లు పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మితో సీబీఐ విచారణ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు ఒక న్యాయవాది సంతకం చేయించుకున్నారని ఆరోపణలు వచ్చాయి. అయితే హెబియస్ కార్పస్ పిటిషన్‌ను కూడా ఉపసంహరించుకుంటున్న విషయంపై పిటిషనర్‌కు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని సాయికృష్ణ పిన్ని కనకదుర్గ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
పిటిషనర్‌కు తెలియకుండా హెబియస్ కార్పస్ పిటిషన్‌ను ఎలా వెనక్కి తీసుకుంటారని కనకదుర్గ తరఫు న్యాయవాది ప్రశ్నించారు. పిటిషనర్ అనుమతి లేకుండానే సంతకం తీసుకున్నారని కోర్టు ముందు వాదించారు. ఈ వ్యవహారంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్‌కు తెలియకుండా హెబియస్ కార్పస్ పిటిషన్ ఉపసంహరణకు సంబంధించిన పిటిషన్ ఎలా దాఖలు చేశారని న్యాయమూర్తి ప్రశ్నించారు. సంబంధిత పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాదికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా, ఈ అంశాన్ని బార్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లి సంబంధిత న్యాయవాది లైసెన్స్ రద్దుకు కూడా సిఫారసు చేసే అవకాశం ఉందని న్యాయమూర్తి హెచ్చరించారు. ఈ కేసు తదుపరి విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.
Also Read
- AP Rain Alert: ఏపీకి మరోసారి భారీ వర్షాల హెచ్చరికలు..! జిల్లాల వారీగా తాజా అంచనా
- Kolusu Parthasarathy: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు కౌంట్‌డౌన్.. ఉత్తరాంధ్రపై పార్థసారథి కీలక వ్యాఖ్యలు
- YSRCP: ముదురుతోన్న డీఎస్సీ వివాదం.. ఉద్యమ బాటలో వైసీపీ.. కార్యాచరణ ప్రకటన
- AP Government: వారసత్వ భూములపై గుడ్‌న్యూస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
తాజావార్తలు
-
Bhagyashri Borse: ‘ఆ విషయం చెబితే మా అమ్మ నన్ను వాట్సాప్‌లో బ్లాక్ చేసింది.. 6 నెలలు మాట్లాడలేదు’..
-
Sonu Sood: విద్యార్థుల నిరసనపై కంగనా వ్యాఖ్యలు సిగ్గుచేటు.. సోనూ సూద్ ఘాటు స్పందన
-
Chanakya Niti: బంధువులైనా సరే.. ఈ విషయాలు మాత్రం చెప్పొద్దంటున్న చాణక్యుడు! ఇంతకీ ఏ విషయాలో తెలుసా?
-
Rahul Gandhi: నా మాటల్లో తప్పులేదు.. క్షమాపణ చెప్పను.. ‘ఇడియట్స్’ వ్యాఖ్యలపై రాహుల్‌గాంధీ క్లారిటీ
-
Sai Krishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. పిటిషన్ ఉపసంహరణపై హైకోర్టు సీరియస్..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్‌టాప్‌లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!