Sai Dharam Tej: మామ భోళా శంకర్.. అల్లుడు గంజా శంకర్.. బావుందయ్యా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sai Dharam Tej: విరూపాక్ష సినిమాతో భారీ హిట్ ను సొంతం చేసుకున్నాడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. ఈ చిత్రం హిట్ తో మంచి జోష్ పెంచిన తేజ్.. ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే తేజ్.. పవన్ కళ్యాణ్ తో పాటు బ్రో సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. ఇక ఈ సినిమా కాకుండా కొత్త దర్శకుడు జయంత్ తో ఒక సినిమ చేస్తుండగా.. మాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సంపత్ నందితో ఒక సినిమా చేయబోతున్నాడు. సంపత్ నంది తో కలిసి చేస్తున్న సినిమా ఈ ఏడాది పట్టాలెక్కనునున్నదని తెలుస్తోంది. ఇక విరూపాక్షలో చాలా క్లాస్ గా కనిపించిన తేజ్.. ఈ చిత్రంలో మరోసారి మాస్ హీరోగా కనిపించనున్నాడట. ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు ‘గంజా శంకర్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీన్ని ఫిలిం చాంబర్ లో సైతం నిర్మాతలు రిజిస్టర్ చేయించినట్లు టాక్ వినిపిస్తోంది.
Aadhipurush : ఆదిపురుష్ సినిమా ను త్రీడి లోనే చూడాలా..?
Also Read
- CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
ఇక ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ నిర్మించబోతున్నారు. సంపత్ నంది.. రెండేళ్ల క్రితం గోపీచంద్ తో కలిసి సీటిమార్ సినిమా తీసాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. ఇక దీంతో ఎలాగైనా ఒక హిట్ అందుకోవాలని ఆయన కసిమీద ఉన్నాడు. ఒక పవర్ ఫుల్ కథతో తేజ్ దగ్గరకు వెళ్లగా.. తేజ్ వెంటనే ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన క్యాస్టింగ్ ప్రస్తుతం జరుగుతుందట. అంతేకాకుండా ఇంకోపక్క ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా జరుపుకుంటున్నారని టాక్. ఇక ఈ టైటిల్ విన్నవెంటనే అభిమానులు..మామ భోళా శంకర్.. అల్లుడు గంజా శంకర్.. బావుందయ్యా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమాతో సంపత్ హిట్ అందుకొని తేజ్ కు మరో హిట్ ను ఇస్తాడా..? లేదా..? అనేది తెలియాలి.
తాజావార్తలు
-
Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
-
Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
-
CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Rahul Gandhi’s SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
-
BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!