హీరోయిన్ సదా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు దర్శకుడు తేజ తెరకెక్కించిన జయం సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయింది ఈ భామ.. మొదటి చిత్రం తోనే అద్భుత విజయం లభించింది. ఈ సినిమా తరువాత ఈమెకు వరుసగా ఆఫర్స్ వచ్చాయి. అలా తెలుగు మరియు తమిళ భాషల లో వరుస సినిమాల లో నటించి స్టార్ హీరోయిన్ గా మెప్పించింది.ఆ తరువాత ఈ భామకు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి.సదా ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించారు.ప్రస్తుతం ఈమె సినిమాలు మరియు వెబ్ సిరీస్ లతో పాటు బుల్లితెర పై ప్రసారమవుతున్న కొన్ని కార్యక్రమాలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నారు.కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న సదా ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉన్నారు.ఈమెతో పాటు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్స్ ఇప్పటికే పెళ్లిళ్లు చేసుకుని మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు.కానీ సదా మాత్రం ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు .
అయితే తాజాగా ఓ కార్యక్రమంలో భాగంగా ఈమె పెళ్లి గురించి చేసిన కామెంట్స్ బాగా వైరల్ గా మారాయి.. తాను ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా ఉండడానికి కారణం అంటూ ఏమి లేదు పెళ్లి చేసుకుంటే తనకు ఉన్న ఫ్రీడం అంతా పోతుందని తెలిపారు. పెళ్లి చేసుకోలేదు కాబట్టే తాను ఎంతో సంతోషంగా ఉన్నానని కూడా తెలిపారు. మనల్ని అర్థం చేసుకున్న వారు దొరికితే పరవాలేదు కానీ లేకపోతే పెళ్లి వలన కష్టాలు వస్తాయని చెప్పుకొచ్చింది.. ప్రస్తుత కాలంలో చాలా మంది స్టార్స్ ఎంతో గ్రాండ్ గా వివాహం చేసుకుంటున్నారు. కానీ వాళ్ళ రిలేషన్ షిప్ పెళ్లి అయి కొన్ని సంవత్సరాలు గడవక ముందే విడాకులు తీసుకుని విడిపోతున్నారు.ఇలా పెళ్లి చేసుకోవడం ఎందుకు విడిపోవడం ఎందుకు అని నేను పెళ్లికి దూరంగా ఉన్నానని ఈ సందర్భంగా సదా పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు..