ఐసీసీ ప్రెసిడెంట్గా ఎన్నికైన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సెక్రటరీ జై షాకు క్రికెట్ గాడ్, భారత మాజీ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ శుభాకాంక్షలు తెలిపారు. బోర్డు కార్యదర్శిగా పురుషుల, మహిళల క్రికెట్‌కు సమాన ప్రాధాన్యత ఇవ్వడంలో జైషా చేసిన కృషిని సచిన్ ప్రశంసించారు.
ఆయా పార్టీల్లో ఉన్న ఆశావాహులకు మరో లక్కీ ఛాన్స్ దక్కనుంది. లోక్‌సభ ఎన్నికల పుణ్యమా? అంటూ రాజ్యసభలో పది రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో త్వరలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ రానుంది.
బి టీమ్ కంపెనీ సీఈఓ, వ్యాపారవేత్త అయిన హల్లా టోమస్‌డోత్తిర్ ఐస్‌లాండ్ యొక్క ఏడవ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఇక ఈమె ఆగస్టు 1న గ్వానా జోహన్నెసన్ నుండి బాధ్యతలు స్వీకరించనున్నారని అక్కడి మీడియా నివేదించింది. 1980లో ప్రజాస్వామ్యయుతంగా అధ్యక్షురాలిగా ఎన్నికైన ప్రపంచంలోనే తొలి మహిళగా గుర్తింపు పొందిన విగ్డిస్ ఫిన్‌బోగాడోత్తిర్ తర్వాత ఆ పదవిని చేపట్టిన రెండో మహిళ టోమస్‌డోత్తిర్ గా రికార్డ్ సృష్టించింది. Afghanistan: నదిని దాటుతుండగా పడవ బోల్తా.. 20 మంది దుర్మరణం.. ఇందుకు…
పాక్ అధ్యక్షుడిగా ( Pakistan President) మరోసారి అసీఫ్ అలీ జర్దారీ (Asif ali zardari) ఎన్నికయ్యారు. మొదటి నుంచి అధ్యక్ష పదవి రేసులో ఆయన పేరే ఎక్కువగా వినిపించింది.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాయ్‌బరేలీ స్థానం నుంచి లోక్‌సభకు 6 పర్యాయాలు పూర్తి చేసిన సోనియా గాంధీ.. తొలిసారి రాజ్యసభలో అడుగు పెట్టనున్నారు. సోనియా గాంధీ ఫిబ్రవరి 15న రాజస్థాన్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు.. ఆమె లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. ఇదిలా ఉంటే రాజస్థాన్ నుంచి సోనియా గాంధీతో పాటు.. బీజేపీకి చెందిన చున్నిలాల్ గరాసియా, మదన్ రాథోడ్…
తెలంగాణ నుంచి రాజ్యసభ ఎంపీలుగా ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మూడు సీట్లకు మూడు నామినేషన్లే రావడంతో ఎన్నిక ఏకగ్రీవం అయింది. కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. కాగా.. రేపు ఎన్నిక ధ్రువీకరణ పత్రాన్ని రేణుకా చౌదరి తీసుకోనున్నారు. మరోవైపు.. అనిల్ కుమార్ యాదవ్ కు రిటర్నింగ్ అధికారులు ఎన్నిక ధ్రువీకరణ పత్రం అందజేశారు.
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అగ్ర నేత రబ్రీదేవికి (Rabri Devi) శాసనమండలిలో ప్రమోషన్ దొరికింది. తాజాగా ఆమె బీహార్ శాసనమండలికి ఆర్జేడీ విపక్ష నేతగాఎన్నికయ్యారు.