Sabitha Indra Reddy : రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 80 టీంలు.. లక్ష కళ్ళజోళ్ళు రెడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని రంగా రెడ్డి జిల్లా మీర్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని అంబేద్కర్ నగర్‌లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె కంటి వెలుగు కార్యక్రమాన్ని ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకున్నారని మంత్రి అన్నారు. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 80 టీములు పనిచేస్తున్నాయని ఇప్పటికే లక్ష కళ్ళజోళ్ళు అందుబాటులో ఉన్నాయని మంత్రి అన్నారు. అధికారులు,ప్రజా ప్రతినిధులు సమన్వయం తో పని చేసి కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి సూచించారు. 18 సంవత్సరాల నిండిన వారికి,వందరోజుల పాటు,వారానికి ఐదు రోజులు,ప్రతిరోజు 300 మందికి కంటి వెలుగు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని మంత్రి తెలిపారు.
Also Read : UK: బ్రిటన్ పార్లమెంట్‌లో మోదీ డాక్యుమెంటరీపై రచ్చ.. గుజరాత్ అల్లర్లపై బీబీసీ సిరీస్..
Also Read
పరీక్షలు నిర్వహించిన వెంటనే కళ్లద్దాలు పంపిణీ జరుగుతుందని అదేవిధంగా ఆపరేషన్ అవసరం ఉన్నవారికి వారికి అందించిన తేదీలలో చేయడం జరుగుతుందని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్,డిప్యూటీ కలెక్టర్ మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్,కార్పొరేటర్లు, నాయకులు, వైద్య శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే.. రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం జరుగుతోంది. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీ, బీఆర్‌ఎస్ నేతలు కంటి వెలుగు శిబిరాలను ప్రారంభిస్తున్నారు. అయితే.. కంటి వెలుగు కార్యక్రమాన్ని గిన్నిస్‌బుక్ ఆఫ్ రికార్డులో చేర్చేందుకు రికార్డు స్థాయిలో సేవలు అందించనున్నారు.
Also Read : Mega Power Star Ram Charan: గోల్డెన్ గ్లోబ్ లో ఒక్క మగాడు
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!