కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సమస్యలు విస్మరించిందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రైతు సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆమె అన్నారు. రైతులు పండించిన ధాన్యానికి క్వింటాలుకు 500 బోనస్ ,నష్టపోయిన పంటలకు ఎకరాకు 25 వేల పరిహారం ఇవ్వాలి, డిమాండ్ చేస్తూ ఈ రోజు కొంగరా కలాన్ లోని రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో జిల్లా ఎమ్మెల్యేలు అరకపురి గాంధీ,యాదయ్య,ప్రకాష్ గౌడ్,ఎమ్మెల్సీ సురభి వాణి, ఇతర ముఖ్య నేతలు అదనపు కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని ఆమె తెలిపారు.
ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ అమల్లో భాగంగా రైతులకు పెట్టుబడి సాయం కింద 15 వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వకపోవడం రైతుల పట్లకాంగ్రెస్ ప్రభుత్వం కపట ప్రేమ ఉందని సబితా ఇంద్రారెడ్డి దుయ్యబట్టారు. రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులలో నీరు సస్యశ్యామలంగా ఉన్నా గాని రైతులకు విడుదల చేయకపోవడం వల్లనే పంటలు ఎండిపోయాయని సబితా రెడ్డి అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతు సమస్యలను పరిష్కరించాలని లేనియెడల బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన ఉదృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.