Site icon NTV Telugu

Sabarimala: నవంబర్ 17నుంచి శబరిమల దర్శనం.. తెరుచుకోనున్న ఆలయం

Shabarimala

Shabarimala

కేరళలోని శబరిమల క్షేత్రంలో కొలువై ఉన్న అయ్యప్ప స్వామి.. నవంబర్‌ 17 (శుక్రవారం) నుంచి భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. ఈ ఏడాది శబరిమల వార్షిక వేడకలకు సిద్ధమైంది. నవంబర్ 17 నుంచి మండల మకరవిళక్కు వేడుకలు ప్రారంభం కానుండగా.. రెండు నెలలపాటు స్వామివారి మహాదర్శనం కొనసాగనుంది. అందుకు సంబంధించి కేరళ దేవాదాయశాఖ అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి రాధాకృష్ణ తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధునాతన సాంకేతికతను ఉపయోగించి అనేక ఏర్పాట్లు చేశామన్నారు.

Read Also: Aishwarya Rai: ఐశ్వర్యారాయ్ పై పాక్ మాజీ క్రికెటర్ దారుణ వ్యాఖ్యలు..

శబరిమల సన్నిధానంలో భారీ రద్దీ దృష్ట్యా.. డైనమిక్‌ క్యూ కంట్రోల్‌ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చామని మంత్రి రాధాకృష్ణ తెలిపారు. అంతేకాకుండా.. నిలాక్కళ్, పంబా, సన్నిధానం ప్రాంతాల్లో వీడియో స్క్రీన్లు ఏర్పాటు చేశామన్నారు. ఇకపోతే.. పంబా-సన్నిధానం మార్గంలో 15 చోట్ల అత్యవసర ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. యాత్ర ఏర్పాట్లకు సంబంధించి సీఎంతో పాటు అధికారులతో ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహించామని మంత్రి రాధాకృష్ణ తెలిపారు.

Read Also: Hijab: “హిజాబ్‌పై నిషేధం లేదు”.. ఎగ్జామ్ అథారిటీ డ్రెస్ కోడ్‌పై మంత్రి స్పష్టత..

శబరిమలను మండల మకరవిళక్కు పండగ సీజన్‌లో ఏటా లక్షల సంఖ్యలో అయ్యప్ప భక్తులు దర్శిస్తుంటారు. మలయాళ నెల వృశ్చికం తొలి రోజున మండల మకరవిళక్కు వేడుకలు ప్రారంభంకానుండగా.. జనవరిలో మకర జ్యోతి దర్శనం ఉంటుంది. ఆ తర్వాత అయ్యప్ప ఆలయాన్ని మూసివేస్తారు.

Exit mobile version