Passive Smoking: పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం. మనందరికీ ఈ వాక్యం తెలుసు. పొగాకు నుంచి వచ్చే పొగ ఎంతో హానికరమైంది. అయితే.. వీరి ఫ్రెండ్స్ సర్కిల్ లో, వీరి ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరికైనా స్మోక్ చేసే అలవాటు ఉంటే దాని దుష్ప్రభావాలు వీరు కూడా భరించవలసి వస్తుంది. దీనినే సెకండ్ హాండ్ స్మోకింగ్ అంటారు. సెకండ్ హాండ్ స్మోకింగ్ కి ఎక్స్పోజ్ అవడాన్ని పాసివ్ స్మోకింగ్ అంటారు. కాగా.. పొగాకు సంబంధిత అలవాట్ల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 80 లక్షల మంది మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు చెబుతున్నాయి. ఇక పొగాకు ఉత్పత్తులను ప్రత్యక్షంగా వినియోగించడం వల్ల 70 లక్షల మంది మరణిస్తే, 10 నుంచి 13 లక్షల మంది పాసివ్ స్మోకింగ్ వల్ల మరణిస్తున్నారని, వీరిలో ఎక్కువ మంది మహిళలే అని వైద్యనిపుణులు వెల్లడించారు.
Read also: Mallareddy Mass Dance: బతుకమ్మ సంబరాల్లో మల్లారెడ్డి మాస్ డ్యాన్స్
పాసివ్ స్మోకింగ్ వల్ల వచ్చే సమస్యలు ఏమిటి?
వైద్య పరిభాషలో చెప్పాలంటే, పొగాకు వాడకం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్, తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు, గుండె జబ్బులు, పక్షవాతం, గొంతు క్యాన్సర్, ఆస్తమా మొదలైనవి వస్తాయి. అయితే.. మహిళలు ఎక్కువగా పాసివ్ స్మోకింగ్ గురవుతారు. కుటుంబంలో ఎవరైనా సిగరెట్ తాగితే అది అతని కుటుంబంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆంకాలజిస్ట్ అంటున్నారు. ముఖ్యంగా చిన్నారులకు సిగరెట్ పొగ శరీరంపై ప్రభావం కలిగిస్తుంది. పొగలోని నికోటిన్ అణువులు చిన్నారుల ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి శ్వాసకోశ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని వైద్య నిపుణులు వెల్లడించారు.
Read also: KTR Sensational Tweet: బతుకమ్మ, మూసీపై ట్వీటర్ వేదికగా ధ్వజమెత్తిన కేటీఆర్..
దీనికి పరిష్కారం ఏమిటి?
అయితే.. పాసివ్ స్మోకింగ్ గురించి అవగాహన కల్పించడమే సరైన పరిష్కారం. టీ స్టాల్స్‌లో పొగతాగే స్నేహితుడు, పొగ తాగని స్నేహితుడు కలిసి టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు. సిగరెట్ తాగే వారి పక్కన కూర్చొవడం మంచిది కాదని అందరూ గుర్తించాలి. ఈ విషయంలో పిల్లలు, మహిళలు జాగ్రత్తగా ఉండాలి. ధూమపానం వల్ల కలిగే అనర్థాలపై శాస్త్రీయ ఆధారాలు ఉన్నప్పటికీ ప్రజల్లో అవగాహన లేదు. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానాన్ని నిషేధించే చట్టాలు ఉన్నాయి, కానీ అవి చాలా తేలికగా తీసుకుంటున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ దీని గురించి తెలుసుకోవాలి. ధూమపానానికి వీలైనంత దూరంగా ఉండాలి. మనం పొగాకు రహిత దిశగా పయనించాలని వైద్యనిపుణులు తెలుపుతున్నారు. అందుకే ఏ సినిమా హాల్ లో అయినా సరే ముందుగా మనం చూసే యాడ్ ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని. అయినా అది యాడ్ కి మాత్రమే పరిమితం చేస్తున్నారు. ఇప్పటికైనా ధూమపాణానికి దూరంగా ఉండండి.. కుటుంబాన్ని, మిమ్మల్ని అనారోగ్య బారిన పడకుండా కాపాడుకోండి.
Hyderabad Rains: నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం.. మరో మూడు రోజులు వానలు