Rythu Bharosa: రైతులకు అలర్ట్.. నేడు మూడో విడత రైతు భరోసా నిధులు విడుదల!
- తెలంగాణలో నేడు మూడో విడత రైతు భరోసా నిధుల విడుదల
- 6.39 లక్షల రైతుల ఖాతాల్లో రూ.1,330.32 కోట్లు జమ
- 3 నుంచి 4 ఎకరాల భూమి కలిగిన రైతులకు రైతు భరోసా నిధులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rythu Bharosa 3rd Installment Released Today: తెలంగాణ ప్రభుత్వం ‘రైతు భరోసా’ పథకం అమలును దశలవారీగా కొనసాగిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో రైతు భరోసా నిధులను అధికారికంగా విడుదల చేశారు. అనంతరం అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా సొమ్ము జమ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు ఎకరాల లోపు భూమి కలిగిన 44.28 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.2,482 కోట్లు ప్రభుత్వం నేరుగా జమ చేసింది. అనంతరం రెండో విడతలో మూడు ఎకరాల వరకు సాగుభూమి ఉన్న రైతులకు రైతు భరోసా సాయం అందించింది.
తాజాగా మూడో విడతలో భాగంగా 3 నుంచి 4 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఈ విడతలో 6.39 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.1,330.32 కోట్లు నేరుగా జమ చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఇప్పటివరకు మూడు విడతల్లో కలిపి రాష్ట్రంలోని 61.35 లక్షల మంది రైతులకు రూ.5,402.37 కోట్ల రైతు భరోసా సాయం అందించబడింది. అర్హులైన ప్రతి రైతుకు ప్రభుత్వం నిర్ణయించిన విధంగా నిధులు దశలవారీగా జమ చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
Also Read
- Murder Case: 'నీలాంటి భర్తలు వెయ్యి మంది దొరుకుతారు'.. ఆ ఒక్క మాటతో జరిగిన ఘోరం, హైకోర్టు కీలక తీర్పు
- Chandrababu: 'అప్పుడు మూడు రాజధానులు.. ఇప్పుడు మావిగన్'.. జగన్‌పై చంద్రబాబు సెటైర్లు
- CM Chandrababu: వీబీజీ రామ్‌జీ పథకానికి శ్రీకారం.. గ్రామాల అభివృద్ధిపై చంద్రబాబు భారీ ప్రకటనలు
- KTR: సీఎం సవాల్ విసిరారు, మధ్యలో జూపల్లి వచ్చారు.. కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది!
రైతులకు వ్యవసాయ పెట్టుబడి భారం తగ్గించడం, సాగు కార్యకలాపాలకు ఆర్థికంగా అండగా నిలవడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తోంది. భూమి విస్తీర్ణాన్ని ఆధారంగా చేసుకుని విడతల వారీగా నిధులు విడుదల చేస్తుండటంతో మిగిలిన అర్హులైన రైతుల ఖాతాల్లో కూడా త్వరలోనే రైతు భరోసా సాయం జమ కానుంది. రైతుల పెట్టుబడి భారం తగ్గించి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. 30 నెలల ప్రజాపాలనలో రైతు తలెత్తుకునేలా పాలన అందిస్తున్నామన్నారు. వ్యవసాయం దండగ కాదని, పండుగగా భావించే పరిస్థితిని ప్రభుత్వం కల్పిస్తోందని సీఎం పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Rahul Samit: రాహుల్ సమిత్ మెరుపులు.. ద్రవిడ్ శైలి.. 360 డిగ్రీ బ్యాటింగ్!
-
Murder Case: ‘నీలాంటి భర్తలు వెయ్యి మంది దొరుకుతారు’.. ఆ ఒక్క మాటతో జరిగిన ఘోరం, హైకోర్టు కీలక తీర్పు
-
Chandrababu: ‘అప్పుడు మూడు రాజధానులు.. ఇప్పుడు మావిగన్’.. జగన్‌పై చంద్రబాబు సెటైర్లు
-
Dulquer Salmaan: ‘ఆపరేషన్ నుమ్ఖోర్’ ఉచ్చులో స్టార్ హీరో.. దుల్కర్‌ను 4 గంటల పాటు విచారించిన అధికారులు!
-
Vishwambhara : విశ్వంభర రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?