Rythu Bandhu : రేపటి నుంచి పదో విడత రైతు బంధు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన రైతు బంధు పథకం కొనసాగుతోంది. అయితే.. తాజాగా పదో విడత రైతుబంధు నిధులు విడుదలపై క్లారిటీ ఇచ్చారు మంత్రి హరీష్ రావు. మంగళవారం ఎంపీపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణికర్‌రావు, చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్‌తో కలిసి సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం దిగ్వాల్‌లో డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రారంభించి, లబ్ధిదారులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రేపటి నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు సాయాన్ని జమచేసి, అన్నదాతలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. హైదరాబాద్‌లోని గేటెడ్ కమ్యూనిటీలా డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించినట్లు చెప్పారు మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ హయాంలో ఇలాంటి ఇండ్లను చూశారా అని ఆయన ప్రశ్నించారు. అప్పట్లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రావాలంటే లంచాలు ఇవ్వాల్సి వచ్చేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని స్పష్టం చేశారు మంత్రి హరీష్ రావు. త్వరలోనే స్థలాలున్న వారికి ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. రూ.5.60కోట్ల వ్యయంతో కోహిర్‌లో 88 డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించినట్లు చెప్పారు మంత్రి హరీష్ రావు.
Also Read : Pawan Kalyan: మూడు పెళ్లిళ్లపై పవన్ కౌంటర్.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన బాలయ్య
రూ.150కోట్లతో జహీరాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. మాజీ మంత్రి గీతారెడ్డి హయాంలోనే తాగేందుకు నీళ్లు కూడా లేని పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు మంత్రి హరీష్ రావు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతి ఆపరేషన్లలో సంగారెడ్డి జిల్లా టాప్‌లో నిలిచిందన్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యలో తెలంగాణలో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు మంత్రి హరీష్ రావు. దేశంలో కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా తెలంగాణలో ఉన్నన్ని పతకాలు ఎక్కడా లేవని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. కోహీర్‌లో రూ.50కోట్లతో ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే డయాలసిస్ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. త్వరలో సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులను ప్రారంభించి గోదావరి జలాలను గోదావరికి తీసుకువస్తామన్నారు.
Also Read
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!