Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Russia Suspends Participation In Last Remaining Nuclear Treaty With Us

Russia: రష్యా అధ్యక్షుడి షాకింగ్ ప్రకటన.. అమెరికాతో అణు ఒప్పందానికి బ్రేక్

Published Date :February 21, 2023 , 7:24 pm
By Mahesh Jakki
Russia: రష్యా అధ్యక్షుడి షాకింగ్ ప్రకటన.. అమెరికాతో అణు ఒప్పందానికి బ్రేక్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Russia: ఉక్రెయిన్‌పై దాడికి ఏడాది కావొస్తున్న వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక ప్రకటన చేశారు. అణ్వాయుధ వినియోగంపై పరిమితి విధిస్తూ అగ్రరాజ్యంతో చేసుకున్న ఒప్పందంలో రష్యా భాగస్వామ్యాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. ఇరుపక్షాల వ్యూహాత్మక అణ్వాయుధాలను పరిమితం చేసే అమెరికాతో న్యూ స్టార్ట్‌ ఒప్పందంలో రష్యా తన భాగస్వామ్యాన్ని నిలిపివేస్తున్నట్లు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈరోజు తెలిపారు. “అమెరికాతో రష్యా వ్యూహాత్మక ప్రమాదకర ఆయుధాల ఒప్పందంలో తన భాగస్వామ్యాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు నేను ఈరోజు ప్రకటించవలసి వచ్చింది” అని ఉక్రెయిన్‌లో యుద్ధానికి దాదాపు ఒక సంవత్సరం పాటు పార్లమెంటులో ప్రధాన ప్రసంగం ముగింపులో పుతిన్ చట్టసభ సభ్యులతో అన్నారు. . అయితే ఒప్పందం నుంచి ఇప్పుడే పూర్తిగా బయటకు రావట్లేదని పుతిన్‌ చెప్పడం గమనార్హం.

ఉక్రెయిన్‌లో రష్యాను ఓడించాలన్న లక్ష్యాన్ని అమెరికా, నాటో దేశాలు బహిరంగంగానే ప్రకటిస్తున్నాయని, వ్యూహాత్మకంగా మమ్మల్ని ఓడించి.. మా అణు కేంద్రాలను చేరుకోవడానికి వారు ప్రయత్నిస్తున్నారని పుతిన్‌ చెప్పారు. ఒప్పందం ప్రకారం రష్యా అణ్వాయుధ సామర్థ్యాలపై అమెరికా తనిఖీలు చేస్తోందన్నారు. అదే సమయంలో నాటో దేశాలు మా వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడులు చేసేందుకు సాయం చేస్తున్నాయని ఆయన ప్రసంగంలో తెలిపారు. అమెరికా ఇలాంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే అణ్వాయుధ ప్రయోగాలను పునరుద్ధరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు ఒప్పందంపై తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు.

Read Also: Pak University Exam: యూనివర్సిటీ పరీక్షలో బూతు ప్రశ్న.. అన్నాచెల్లి మధ్య లింక్‌!

వాస్తవానికి ఈ న్యూ స్టార్ట్‌ ట్రిటీ ఒప్పందంపై 2010లో ఇరు దేశాలు సంతకం చేశాయి. ఆ తర్వాత ఏడాదే ఇది అమల్లులోకి వచ్చింది. మళ్లీ 2021లో జో బైడెన్‌ పదవీ భాద్యతలు స్వీకరించిన తర్వాత ఈ ఒప్పందం మరో ఐదేళ్ల పాటు పొడిగించడం జరిగింది. ఇది అమెరికా రష్యా వ్యూహాత్మక అణు వార్‌హెడ్‌లను సంఖ్యను పరిమితం చేసేలా, భూమి, జలాంతర్గామీ ఆధారిత క్షిపణులు, బాంబులను మరింతగా విస్తరింప చేస్తోంది. పుణుల అభిప్రాయం ప్రకారం..రష్యా వద్ద దాదాపు 6 వేల వార్‌హెడ్‌లతో ప్రపంచంలోనే అతిపెద్ద అణ్వాయుధాల నిల్వ ఉన్నట్లు సమాచారం. అంతేగాదు రష్యా, అమెరికాలే వద్ద ప్రపంచంలోని 90శాతం అణు వార్‌హెడ్‌లను కలిగి ఉన్నాయని, ఇవి ఒక గ్రహాన్ని పూర్తిగా నాశనం చేయగలవని చెబుతున్నారు. 2010లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, రష్యా అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్‌ మధ్య న్యూ స్టార్ట్‌ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం.. ఇరు దేశాలు 1550 కంటే ఎక్కువ న్యూక్లియర్‌ వార్‌హెడ్‌లు, 700 కంటే ఎక్కువ క్షిపణులు, బాంబర్లను మోహరించకూడదు. 2021 ఫిబ్రవరి నాటికి ఈ ఒప్పందం గడువు ముగియగా.. దీన్ని మరో ఐదేళ్లు పొడగించుకునేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. ఈ ఒప్పందం కింద ఇరు దేశాలు పరస్పరం తనిఖీలు చేసుకుంటాయి. అయితే కొవిడ్ మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా ఈ తనిఖీలను నిలిపివేశారు. ఇటీవల అమెరికా ఈ తనిఖీలను పునరుద్ధరించాలని ప్రయత్నించగా.. ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో రష్యా తిరస్కరిస్తూ వస్తోంది. తాజాగా ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పుతిన్‌ ప్రకటించారు.

ఉక్రెయిన్‌పై దాడికి ఏడాది కావొస్తున్న వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో రష్యన్‌ స్టేట్‌ మీడియా వెబ్‌సైట్లు డౌన్‌ అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు పాత్రికేయులు రష్యా స్టేట్ టెలివిజన్ అండ్‌ రేడియో బ్రాడ్‌కాస్టింగ్‌ కంపెనీ వెబ్‌సైట్‌ సేవలను పొందలేకపోయారు. దీనిపై ఆ కంపెనీ స్పందించింది. సాంకేతిక పరంగా కొన్ని పనులు చేపడుతున్నామని వెల్లడించింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • america
  • Joe Biden
  • new START treaty
  • Nuclear Treaty
  • Nuclear Treaty With US

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates : మేం దాడులు చేస్తే శత్రువులు బెంబెలెత్తిపోవాల్సిందే.. అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ వార్నింగ్!

  • Israel: ‘‘ప్రభుత్వాన్ని పడగొట్టండి’’.. ఇరాన్ ప్రజలకు నెతన్యాహూ పిలుపు..

  • Pakistan: “భారత్‌తో పోటీ పడేంత సీన్ లేదు”.. సొంత టీమ్‌పై పాకిస్థాన్ మాజీ ప్లేయర్స్ ఫైర్..

  • Pakistan: పాకిస్తాన్‌‌‌కు అంటుకున్న “ఇరాన్” మంటలు.. యూఎస్ కాల్పుల్లో 12 మంది మృతి..

  • Israel-Iran War: ఇరాన్‌పై ఇజ్రాయిల్ భీకర దాడులు, టెహ్రాన్‌పై బాంబుల వర్షం..

  • Saraswathi : వరలక్ష్మి ‘సరస్వతి’కి బాలయ్య సపోర్ట్..

ట్రెండింగ్‌

  • Virendra Sehwag-MS Dhoni: ఎంఎస్ ధోనీ అదృష్టంతో జన్మించాడు.. సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • IND vs WI Super 8: ఈడెన్‌ గార్డెన్స్‌లో ‘కింగ్’.. అయినా భారత్‌ను వెంటాడుతున్న ఆ సమస్య!

  • Korralu Upma Benefits : కొర్రల ఉప్మా.. షుగర్ ఉన్నవారికి ఒక వరం.. నరాల బలహీనతకు చెక్..

  • Chaganti Koteswara Rao: “ఇంతకంటే అడుక్కు తినడం మంచిది”.. అలాంటి యూట్యూబర్స్‌పై చాగంటి ఫైర్..

  • 100W ఫాస్ట్ ఛార్జింగ్, IP68/IP69 రేటింగ్ తో Huawei Mate 80 Pro గ్లోబల్ లాంచ్‌..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions