Russia Explosion: రష్యాలో భారీ పేలుడు.. 12 మంది మృతి! 60 మందికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
12 Dead and 60 Injured in Fire at Makhachkala in Russia: రష్యా దక్షిణ ప్రాంతంలోని డాగేస్తాన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఓ గ్యాస్ స్టేషన్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. మరోవైపు దాదాపు 60 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనను రష్యా అధికారులు మంగళవారం తెల్లవారుజామున దృవీకరించారు. డాగేస్తాన్ రాజధాని మఖచ్కలలో ఉన్న ఓ ఫిల్లింగ్ స్టేషన్లో రష్యా కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
కాస్పియన్ సముద్రం ఒడ్డున ఉన్న మఖచ్కల నగరంలో హైవే పక్కన ఉన్న ఓ కార్ల సర్వీసింగ్ సెంటర్లో ముందుగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు పక్కనే ఉన్న గ్యాస్ స్టేషన్‌కు వ్యాపించాయి. దీంతో పెద్దఎత్తున పేలుడు సంభవించింది. మంటల తీవ్రత ఎక్కువగా ఉండడంతో పరిసర ప్రాంతాలకు సైతం వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది 260 ఫైరింజన్లతో సహాయక చర్యలు చేపట్టారు. మూడున్నర గంటల కంటే ఎక్కువ సమయం శ్రమించాక మంటలు అదుపులోకి వచ్చాయి.
Also Read
- TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
- Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- YSRCP Candidates List: మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. పూర్తి జాబితా ఇదే!
Also Read: Gold Today Price: మగువలకు గుడ్ న్యూస్.. స్థిరంగా బంగారం ధరలు! భారీగా తగ్గిన వెండి
ఈ అగ్ని ప్రమాదంలో పలు కార్లు కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా.. గాయపడిన వారి సంఖ్య 60కి పైగా ఉంది. గాయపడిన వారిలో 13 మంది చిన్నారులు ఉన్నట్లు డాగేస్తానీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికార వర్గాలు మంగళవారం తెల్లవారుజామున విడుదల చేసిన ఓ వీడియో ప్రకటనలో తెలిపారు. అగ్ని ప్రమాదంలో ఓ భారీ అంతస్థుల భవనం దగ్ధమైనట్లు సమాచారం తెలుస్తోంది.
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!