సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎలాంటి వార్త అయిన చిటికెలో తెలిసిపోతుంది.. ఒక వార్త ఏదైనా ఉందంటే అది క్షణాల్లో వైరల్ అవుతుంది.. కొన్ని వీడియోలు ఫోటోలు తెగ వైరల్ అవ్వడంతో పాటు కామెంట్స్ ను కూడా అందుకుంటాయి.. ఇటీవల కాలంలో 2 వేల నోటును ప్రభుత్వం బ్యాన్ చేసిన విషయం తెలిసిందే.. దాంతో జనాలు చాలా మంది ఇబ్బందులు పడ్డారు.. తమ దగ్గర ఉన్న బ్యాంకులలో నోట్లను మార్చుకున్నారు.. అదే విధంగా రూ.500 నోట్లు చెలామణి లో ఉన్నాయి.. అయితే ఇక్కడ పెద్ద చిక్కు వచ్చి పడింది.. అదేంటంటే ఫెక్ నోట్లు కూడా విచ్చలవిడిగా చలామణి అవుతున్నాయి..
ఎంతగా దొంగ నోట్లు వస్తున్నాయంటే ఆఖరికి బ్యాంక్ ఎటిఏం లలో కూడా దొంగ నోట్లు వస్తున్నాయని ప్రజకు వాపోతున్నారు.. దీనిపై ప్రభుత్వం కూడా సమాలోచన చేస్తుంది.. అయితే ఓ న్యూస్ వైరల్ గా మారింది.. రూ.500 నోటు గురించి ఓ వార్తకు సంబందించిన మెసేజ్ లు వస్తున్నాయని తెలుస్తుంది.. ప్రస్తుతం రూ. 500 నోట్ల గురించి అలాంటి ఫేక్ మెసేజ్ ఒకటి వైరల్ అవుతోంది. రూ. 500 నోటుపై ఉన్న సీరియల్ నంబర్‌లో స్టార్ (*) గుర్తు ఉంటే అలాంటి నోట్లు నకిలీవని ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ రంగ వార్తా సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో – పీఐబీ (PIB) ఫాక్ట్ చెక్ ప్రకారం.. రూ. 500 నోటు గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా తప్ప తేల్చింది..
ఆ మెసేజ్ లో ఉన్నట్లుగా స్టార్ గుర్తు ఉన్న రూ.500 నోట్లు నకిలీవి కావు. 2016లో రూ.500, రూ.1000 నోట్ల రద్దు అనంతరం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- ఆర్బీఐ స్టార్ (*) గుర్తుతో ఉన్న నంబర్ సిరీస్ నోట్లను ప్రవేశపెట్టింది. కాబట్టి అలాంటి నోట్లు నకిలీవని వచ్చే మెసేజ్‌లను నమ్మవద్దు. భారతీయ కరెన్సీకి సంబంధించి మీకు ఏవైనా సందేహాలు ఉంటే ఆర్బీఐ అధికారిక వెబ్ సైట్ లో పూర్తి సమాచారాన్ని తెలుసుకున్నాకే ఏదైనా నమ్మాలని, అనవసరంగా ప్రభుత్వం ఇలాంటి మెసేజ్ లు పంపించదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.. సో బీ కేర్ ఫుల్..