2000 Notes Ban: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.2వేల నోటు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. బ్యాంకుల్లో ఆ నోట్లను మార్చుకునేందుకు సెప్టెంబర్ 30వరకు గడువు ఇచ్చింది. అప్పటి వరకు ఈ నోట్లు చెలామణిలోనే ఉంటాయి. ఇప్పటి నుంచే జనాలు నోట్లను మార్చుకునేందుకు బ్యాంకులకు క్యూ కట్టారు. కానీ ఆర్బీఐ ఓ కండీషన్ పెట్టింది. రోజు పదినోట్లు అంటే రూ.20వేలు మాత్రమే మార్చుకోవాలని సూచించింది. ఈ కండీషన్ తో సామాన్యులకు వచ్చిన ఇబ్బందులేమీ ఉండవు. కానీ వచ్చిన తిప్పలల్లా బడా బాబులకే. దీంతో ఆ నోట్లను ఎలా వదిలించుకోవాలంటూ తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే నోట్లను మార్చుకునేందుకు కొత్త మార్గాలను ఆశ్రయిస్తున్నారు.
Read Also: Rs 2000 notes withdrawn: రూ.2 వేల నోట్లపై కొత్త టెన్షన్.. బ్యాంకులో వేస్తే ఐటీ వాళ్లు పట్టుకుంటారా?
నోట్ల రద్దు ప్రకటన వచ్చిన దగ్గరనుంచి బంగారం దుకాణాల్లో రద్దీపెరిగింది. తమ దగ్గరనున్న నోట్లను వదిలించుకునేందుకు డబ్బున్న వాళ్లు భారీగా బంగారం కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బంగారం ధర చుక్కలనంటుతుంది. ప్రస్తుతం బంగారం ధర అటు ఇటు 63వేలు ఉంది. అంత ధరలో కూడా బంగారం కొనుగోలుకు వెనకాడడం లేదని తెలుస్తోంది. ఆర్థిక రాజధాని ముంబైలోని బడా బాబులు రూ. 2వేల నోట్లు ఇచ్చి బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తున్నారు. ఇదే అదునుగా భావిస్తున్న గోల్డ్ షాపు యజమానులు అధిక ధరకు బంగారాన్ని విక్రయిస్టున్నట్లు తెలుస్తోంది. శనివారం మధ్యాహ్నం బంగారాన్ని అనధికారిక మార్కెట్ లో పది గ్రాముల బంగారం దాదాపు రూ. 67వేలకు కొందరు గోల్డ్ వ్యాపారులు విక్రయాలు చేశారు. బంగారం ధర అధికారికంగా ముంబైలో రూ. 63,800 (జీఎస్టీతో కలిపి) ఉంది. రెండు వేల నోట్లు పెద్ద మొత్తంలో దాచిన ధనవంతులు బ్యాంకులకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే పన్ను కట్టాల్సి వస్తుందని ఇతర మార్గాలపై దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలోనే గోల్డ్ తరువాత.. రియల్ ఎస్టేట్ రంగంలోనూ, దేవాలయాలు, మత సంస్థల ద్వారా నగదును మార్పిడి చేసుకొనే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.
Read Also: Narsingi accident: మితిమీరిన వేగంతో ఆటోను ఢీకొట్టిన కారు.. స్పాట్ లోనే నలుగురు మృతి