Rs 2000 notes withdrawn: సర్క్యూలేషన్ లో వున్న రెండు వేల నోటును ఉపసంహంచుకుంటున్నట్టు ఆర్బీఐ చేసిన ప్రకటనతో సామాన్యుల్లో గందరగోళం మొదలైంది. 2 వేల నోట్లు బ్యాంకులకు ఇస్తే ఏమవుతుందోనంటూ కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. కానీ, సాధారణ జనం, టెన్షన్ పడాల్సిన అవసరంలేదంటున్నారు నిపుణులు. వాస్తవానికి సామాన్యుల దగ్గర రెండు వేల నోట్లు లేవు. ఉన్నా కూడా ఎన్నొకొన్ని మాత్రమే వుంటాయి. తమ దగ్గర 2 వేల నోట్లున్నవారు అకౌంట్‌లో డిపాజిట్ చేసుకోవచ్చు. లేదా మార్చుకోవచ్చు. ఒక బ్రాంచీలో ఒకసారి పది నోట్లు.. అంటే 20 వేల వరకు మార్చుకోవడానికి అవకాశం వుంటుంది. డిపాజిట్లపై ఎలాంటి పరిమితి లేదు. ఎన్ని నోట్లయినా వేసుకుని, విత్ డ్రా చేసుకోవచ్చు. సెప్టెంబర్ 30 వరకు ఈ సదుపాయం వుంది. అంతవరకు లీగల్ టెండర్ గానూ అన్ని రకాలుగా వినియోగించుకోవచ్చు. 2 వేల నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే, ఐటీవాళ్లు పట్టుకుంటారన్న భయం అవసరం లేదు.
Read Also: Currency : పేపర్ కరెన్సీకి ప్రభుత్వం స్వస్తి చెప్పనుందా.. అందుకే 2000 నోట్లను రద్దు చేసిందా ?
రెండు వేల నోటు ఉపసంహరణతో సామాన్యులకు వచ్చిన ఇబ్బందేమీలేదు. సమస్య ఏమైనా వుంటే, అది బడాబడా బాబులకు, అక్రమార్కులకు మాత్రమే. నల్లధనానికి కేరాఫ్ అడ్రసయిన రియల్ ఎస్టేట్ వ్యాపారుల నేలమాళిగల్లో గుర్రుమని నిద్రపోతున్నాయి. ట్యాక్స్ ఎగవేత వ్యాపారాల్లోనే మెరుస్తోంది 2 వేల నోటు. భారీగా 2వేల నోట్లను దాచిపెట్టుకున్న కొందరు రాజకీయ, సినీ ప్రముఖులకు ఇబ్బంది తప్పదు. తక్కువ నోట్లతో ఎక్కువ మొత్తం పోగేసుకోవడానికి 2 వేల నోట్లను ఇలాంటి సంపన్నులే వినియోగించారు. ఇలాంటి వారిదగ్గరే పెద్ద నోట్లు బ్లాక్ అయ్యాయి. దీంతో నోట్ల మార్పిడిలో వీరు ప్రతిపైసాకు లెక్క చెప్పాలి. గడువు దాటిన తర్వాత వారిదగ్గరున్న రెండు వేల నోట్లు చిత్తు కాగితాల్లాగే మిగిలిపోతాయంటున్నారు ఆర్థిక నిపుణులు. కాబట్టి, రెండు వేల నోటు పెద్దగాలేని సామాన్యులకు ఈ పరిణామం సమస్య కాబోదని చెబుతున్నారు.