Narsingi accident: మితిమీరిన వేగంతో ఆటోను ఢీకొట్టిన కారు.. స్పాట్ లోనే నలుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Narsingi accident: మెదక్ జిల్లా నార్సింగి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఉదయం ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు శేఖర్, యశ్వంత్ ,బాలనర్సయ్య , మణెమ్మలు అక్కడికక్కడే మరణించారు. గజ్వాల్ ఆటో ఆర్మూర్ నుంచి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానిక సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆర్మూర్ మండలం ఏలూరుకు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. రోడ్డు ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మితిమీరిన వేగంతో ఆటోను కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read also: Love Affair: ఒకరితో లవ్ మరొకరితో ఎఫైర్.. ప్రియురాలు బర్త్ డే రోజే ప్రియుడు సూసైడ్
Also Read
ఈరోజు ఉదయం జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు దొంగల మర్రి వద్ద మరో రోడ్డు ప్రమాదం జరిగింది. మామిడికాయల లోడుతో వెళ్తున్న మినీ వ్యాన్ పేలి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రయాణ సమయంలో వ్యాన్‌లో 11 మంది కూలీలు ఉండగా, మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Four months time: నాలుగు నెలలు టైం ఉంది.. రూ.2వేల నోట్లు మార్చేందుకు టెన్షన్ ఎందుకు
తాజావార్తలు
-
YS Jagan: నేడు ఒంగోలుకు వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ
-
Veg Keema: నాన్వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Amaravati – Krishna River: అమరావతికి గుడ్న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
-
H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
-
O Andala Rakshasi: థియేటర్లు ఇవ్వడం లేదు.. తొక్కిపెడితే ఊరుకోం.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో!
ట్రెండింగ్
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!