RRB ALP Recruitment 2025: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు అసిస్టెంట్ లోకో పైలట్ 9970 పోస్టుల నియామకానికి దరఖాస్తు గడువును పొడిగించింది. గతంలో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని మే 11, 2025గా నిర్ణయించారు. కానీ, ఇప్పుడు దీనిని మే 19, 2025 వరకు పొడిగించారు. దీనితో ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు ఇకపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారు RRB అధికారిక వెబ్‌సైట్ rrbapply.gov.in ద్వారా మే 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక దరఖాస్తు రుసుము చెల్లించడానికి చివరి తేదీని మే 21 వరకు పొడిగించింది. ఇందులో వయోపరిమితి జూలై 1, 2025 ఆధారంగా లెక్కించబడుతుంది. దానిలో ఎటువంటి మార్పు చేయబడలేదు. కానీ.. విద్యా అర్హత, అన్ని ఇతర ధృవపత్రాల చెల్లుబాటు తేదీని పొడిగించారు. ఇంతకుముందు ఈ తేదీ మే 11 ఉండగా కానీ ఇప్పుడు దానిని మే 19 వరకు పొడిగించారు. ఈ నియామక ప్రక్రియ కింద రైల్వేలలో మొత్తం 9970 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులను భర్తీ చేస్తారు. ఇక డివిజన్ వారీగా ఖాళీలు ఇలా ఉన్నాయి.
Read Also: Operation Sindoor: ఐసీ 814 హైజాక్ ఉగ్రవాదులతో సహా 100 మందిని హతం చేశాం
* సెంట్రల్ రైల్వే (Central Railway) – 376 పోస్టులు
* ఈస్ట్రన్ రైల్వే (Eastern Railway) – 868 పోస్టులు
* సదరన్ రైల్వే (Southern Railway) – 510 పోస్టులు
* వెస్ట్రన్ రైల్వే (Western Railway) – 885 పోస్టులు
* సౌత్ ఈస్ట్రన్ రైల్వే (South Eastern Railway) – 921 పోస్టులు
* నార్తరన్ రైల్వే (Northern Railway) – 521 పోస్టులు
* నార్త్ ఈస్ట్రన్ ఫ్రంటియర్ (North Eastern Frontier) – 125 పోస్టులు
* ఈస్ట్ సెంట్రల్ రైల్వే (East Central Railway) – 700 పోస్టులు
* నార్త్ సెంట్రల్ రైల్వే (North Central Railway) – 508 పోస్టులు
* వెస్ట్ సెంట్రల్ రైల్వే (West Central Railway) – 759 పోస్టులు
* సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (South East Central Railway) – 568 పోస్టులు
* సౌత్ సెంట్రల్ రైల్వే (South Central Railway) – 989 పోస్టులు
* నార్త్ ఈస్ట్రన్ రైల్వే (North Eastern Railway) – 100 పోస్టులు
* నార్త్ వెస్ట్రన్ రైల్వే (North Western Railway) – 679 పోస్టులు
* మెట్రో రైల్వే కోల్‌కతా (Metro Railway Kolkata) – 225 పోస్టులు.
Read Also: Budget Phones: రూ.15,000 లోపే అదిరిపోయే ఫీచర్స్ తో బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్లు ఇదిగో..!
RRB ALP రిక్రూట్‌మెంట్ 2025 లో అర్హతల విషయానికి వస్తే.. సంబంధిత ట్రేడ్‌లో ITI సర్టిఫికేట్‌తో 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. లేదా ఇంజనీరింగ్‌లో మూడు సంవత్సరాల డిప్లొమా లేదా సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్‌లో బాచిలర్ డిగ్రీ ఉండాలి. అభ్యర్థులు 2025 జూలై 1 నాటికి 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. ఇక జనరల్, OBC వారు రూ. 500 (CBT 1 పరీక్షలో హాజరయ్యాక రూ. 400 తిరిగి చెల్లించబడుతుంది) చెల్లించాలి. అలాగే SC, ST, PwBD, మహిళలు, మాజీ సైనికులు రూ. 250 (CBT 1 పరీక్షలో హాజరయ్యాక పూర్తిగా తిరిగి చెల్లించబడుతుంది) చెల్లించాలి.
ఇక ఈ RRB ALP రిక్రూట్‌మెంట్ 2025 ఎంపిక ప్రక్రియ చూస్తే.. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో రెండు కంప్యూటర్-బేస్డ్ టెస్ట్‌లు (CBT 1 అండ్ CBT 2) ఉంటాయి. వీటితో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య ఆరోగ్య పరీక్ష కూడా ఉంటుంది. CBT 1లో 75 ప్రశ్నలు ఉంటాయి. వీటిని 60 నిమిషాల్లో పూర్తి చేయాలి. CBT 2లో రెండు భాగాలు ఉంటాయి. భాగం A (100 ప్రశ్నలు, 90 నిమిషాలు), భాగం B (75 ట్రేడ్-స్పెసిఫిక్ ప్రశ్నలు, 60 నిమిషాలు) గా ఉంటుంది. ఈ రెండు CBTలలోనూ నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. అభ్యర్థులు తమ ఆధార్ వివరాలు క్లాస్ 10 మార్క్ షీట్‌లో ఉన్న సమాచారంతో సరిపోల్చుకోవాలని సూచించబడుతుంది. లేకపోతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో ఇబ్బందులు ఉండవచ్చు.