జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం వేదికగా ఉత్కంఠ మ్యాచ్ జరుగుతోంది. ఐపీఎల్ 16వ సీజన్లో 26వ మ్యాచ్ సంజూ శాంసన్ రాజస్థాన్ రాయల్స్, కేఎల్ రాహుల్ నేతృత్వంలోని లక్నో సూపర్ జెయింట్‌తో తలపడుతోంది. అయితే.. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్లో పాయింట్ల పట్టికలో ఈ రెండు జట్లు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో లక్నో బ్యాటింగ్‌కు దిగి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. అయితే 155 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ పవర్ ప్లే ముగిసే సరికి.. రాజస్థాన్ 47 పరుగులు సాధించింది.
Also Read : Covid Deaths: కోవిడ్ మరణాలపై ప్రభుత్వం ఏమందంటే?
అయితే.. మార్కస్ స్టోయినిస్ బౌలింగ్‌లో తొలి బంతికి సిక్స్ కొట్టిన జైశ్వాల్(44) అదే ఊపులో మరో షాట్‌కు యత్నించి అవేశ్ ఖాన్ చేతికి చిక్కి తొలి వికెట్‌ను సమర్పించుకున్నాడు. 12 ఓవర్లు ముగిసే సరికి రాజస్థాన్ వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది. సంజు శాంసన్(2), జోస్ బట్లర్(35) క్రీజులో ఉన్నారు.
Also Read : LSG vs RR : ముగిసిన లక్నో బ్యాటింగ్.. రాజస్థాన్ లక్ష్యం 155.