పూలల్లో గులాబీలకు ప్రత్యేక స్థానం ఉంది.. సువాసనలు వెదజల్లడంతో పాటుగా రకరకాల రంగుల్లో దొరుకుతాయి.. ప్రత్యేక ఈవెంట్స్ లలో వీటికి ప్రాధాన్యత ఉంటుంది.. అందుకే రైతులు వీటిని ఎక్కువగా సాగు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.. తెలుగు రాష్ట్రాలలో పండించే రోజా పూలకు మంచి గిరాకి ఉంది. ముఖ్యంగా పాలా హౌస్ పూలు సాగు చేసే రైతులు ప్రధాన ఎంపిక గులాబీనే. గులాబి సాగును రైతులు ఎక్కువగా సాగుచేస్తున్నారు. కానీ చీడపీడల కారణంగా సరైన దిగుబడులను తీయలేకపోతున్నారు. జూలై ఆగస్టు మాసాలలో పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటూ రాత్రులు చల్లగా ఉండటం వలన గులాబీ పంటలో తామర పురుగుల ఆశించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. తామర పురుగులు గులాబీ పంటను ఆశించి ఆకులు, పూలను తినేస్తూ పంటకు తీవ్రంగా నష్టాన్ని కలిగిస్తున్నాయి..
ఈ తెగులు నుంచి బయటపడాలంటే ముందుగా మొక్కల చుట్లు ఎటువంటి చెత్త, కలుపు లేకుండా చెయ్యాలి. వేసవిలో లోతు దుక్కులు దున్నడం వల్లన కోశస్ధ దశలలో నాశనం చేయవచ్చు. బెట్ట పరిస్థితుల్లో వీట్టి ఉధృతి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని సక్రమంగా అందించాలి. ఫాగర్స్ ద్వారా నీటిని పిచికారి చేస్తే ఉధృతిని కొంతవరకు తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా యూరియా భాస్కరం పొటాషం ఎరువులను ఒక 1.8:3 నిష్పత్తిలో ప్రతి మొక్కకు నెలలో మూడుసార్లు పిచికారి చెయ్యాలి..
మొక్కలకు నీడ పడకుండా చూసుకోవాలి.. అంటే ఎండ బాగా తగిలేలా చూసుకోవాలి.. అప్పుడే ఈ పురుగులు నాశనం అవుతాయి.. నీడ ఉన్నట్లయితే పురుగులు తెగల బెడద అధికంగా ఉండి మొక్కలు సన్నగా బలహీనంగా మారుతాయి. దీనివల్ల కిరణ జన్య సంయోగ క్రియ శ్వాసక్రియ. హార్మోన ఉత్పత్తి అధికంగా జరిగి చెట్టుకు పూల మొగ్గలు అధికంగా వస్తాయి.. దిగుబడి కూడా అధికంగా ఉంటుంది.. గులాబీ లో తెగుళ్ల గురించి మరింత సమాచారాన్ని తెలుసుకొనేందుకు దగ్గరలోని వ్యవసాయ నిపుణుల సలహా తీసుకోవడం మంచిది..