కాయలు, పండ్లు మాత్రమే కాదు రైతులు పూల సాగును కూడా ఎక్కువగా చేస్తున్నారు.. అందులోను కొత్తరకం పూలను పండించడానికి రైతులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.. కొత్త రకం గులాబిని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ బెంగళూరు వాళ్ళు తయారు చేశారు. ఈ గులాబీ పువ్వులను తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో సాగు చేస్తున్నారు.. ఈ కొత్త రకం పేరు ఆర్కా సవి గులాబీ అంటారు.
ఈ రైతు పెద్ద మొత్తంలో ఆర్కా సవి గులాబీ రకం సాగు చేస్తున్నారు. ఆర్కా సవి గులాబీ ఒక ఎకరంలో దాదాపు 2200 మొక్కలు నాటుకోవచ్చు. మొక్కల మధ్య దూరం 2.5 అడుగులు ఉండాలి. వరుసల మధ్య ఎనిమిది అడుగుల దూరం ఉండాలి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ నుంచి ఈ మొక్కలను తీసుకోవచ్చు.. ఈ గులాబీ మొలకలు కొనుగోలు చెయ్యాలి.. ఒక్కో మొక్క ఖరీదు 40 రూపాయలు ఉంటుంది.. ఒక ఎకరా పొలంలో నాటాలంటే 2200 మొక్కలు పడతాని నిపుణులు చెబుతున్నారు..
మొక్కలు నాటిన ఎనిమిది నెలల తర్వాత ఆర్కా సవి గులాబీ పువ్వులు పూస్తాయి. ఆర్కా సవి గులాబీ మొక్కలు డ్రిప్ ద్వారా నీళ్లు అందించారు. డ్రిప్ ఇరిగేషన్ నుంచి మొక్కలకి నీటిని అందించడం వల్ల నీటిని వృధా చేయడం తగ్గుతుంది. రోజు మర్చి రోజు ఆర్కా సవి గులాబీలు కోసుకోవచ్చు. పూలు మరీ విచ్చిన తర్వాత కాకుండా రోజ మార్చి రోజూ కొయ్యడం మంచిదని చెబుతున్నారు.. ఈ గులాబీ పువ్వులు మార్కెట్లో ఒక కిలో 100 రూపాయలకు అమ్ముతున్నారు. ఈ గులాబీ పువ్వులు 2-3 రోజులు ఉంచిన కూడా వాటి రెక్కలు రాలిపోవు. వేరే గులాబీ పువ్వులతో పోలిస్తే ఆర్కా సవి గులాబీ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఈ పువ్వులని ప్రస్తుతం హైదరాబాద్ నగరానికి ఎక్కువ మొత్తంలో ఎగుమతి చేస్తున్నారు.. వీటికి మంచి వాసన ఉండటంతో సౌందర్య సాధనాలలో కూడా ఉపయోగిస్తారని చెబుతున్నారు.. ఈ పూలకు మంచి డిమాండ్ ఉండటంతో రైతులు ఎక్కువగా పండిస్తున్నారు..