NTV Telugu Site icon

IND vs AFG: శతకం బాదిన హిట్ మ్యాన్‌.. సచిన్‌ రికార్డు బ్రేక్‌

Rohit Sharma

Rohit Sharma

IND vs AFG: భారత కెప్టెన్‌ రోహిత్ శర్మ అఫ్గానిస్థాన్‌పై తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. వన్డే వరల్డ్‌ కప్‌ 2023 టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో మొదటి మ్యాచ్‌లో విఫలమైన హిట్‌ మ్యాన్‌.. పసికూన అఫ్గాన్‌పై శతకంతో చెలరేగిపోయాడు. మొదటి వన్డే ప్రపంచ కప్ ఆడుతున్న ఇషాన్ కిషన్ నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించినా.. మరో ఎండ్‌లో ‘హిట్ మ్యాన్’ బౌండరీలతో అఫ్గాన్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 63 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో రోహిత్ శర్మ సెంచరీని పూర్తి చేశాడు. అఫ్గాన్‌ బౌలర్ మహ్మద్‌ నబీ వేసిన 18 ఓవర్‌లో మొదటి బంతికి ఫోర్‌ బాది 99కి చేరుకున్న రోహిత్‌.. తర్వాత బంతికి సింగిల్ తీసి తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 63 బంతుల్లో శతకం బాది అత్యంత వేగంగా సెంచరీ పూర్తి చేసుకున్న భారత ఆటగాడిగా రికార్డును నమోదు చేశాడు. ఈ క్రమంలోనే ప్రపంచకప్‌లో ఏడో సెంచరీని తన ఖాతాలో వేసుకుని.. సచిన్(6) పేరిట ఉన్న రికార్డును బ్రేక్‌ చేశాడు.

Also Read: World Cup 2023: గాజాకు మద్దతుగా పాక్ క్రికెటర్ రిజ్వాన్.. సెంచరీ అంకితం.. నెటిజన్ల రియాక్షన్ ఇదే..

ఇదిలా ఉండగా.. ఫజల్ హక్ ఫారూకీ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో రెండో బంతికి సిక్సర్ బాదిన రోహిత్ శర్మ.. వరల్డ్ కప్‌లో 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అత్యంత వేగంగా 1000 వన్డే వరల్డ్ కప్ పరుగులు చేసిన బ్యాటర్‌గా డేవిడ్ వార్నర్ రికార్డును సమం చేశాడు. టీమిండియాతో మొదటి మ్యాచ్‌లో వరల్డ్ కప్‌లో 1000 పరుగులు అందుకుని, సచిన్ రికార్డు బ్రేక్ చేశాడు డేవిడ్ వార్నర్. ఆ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 22 పరుగులు చేసి ఉంటే, వార్నర్ రికార్డు కూడా బ్రేక్ అయ్యేది. అయితే ఆ మ్యాచ్‌లో రోహిత్ డకౌట్ కావడంతో వార్నర్ రికార్డు సమం మాత్రమే అయ్యింది. మరో వైపు టీమిండియా తరఫున వరల్డ్‌ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాటర్‌గా రోహిత్‌ నిలిచాడు. సచిన్ టెండూల్కర్ 2278 వన్డే వరల్డ్ కప్ పరుగులతో టాప్‌లో ఉంటే, విరాట్ కోహ్లీ 1115 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. 1006 పరుగులు చేసిన సౌరవ్ గంగూలీని కూడా రోహిత్‌ శర్మ దాటేశాడు.

మరో వైపు అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రోహిత్‌ రికార్డు సృష్టించారు. క్రిస్ గేల్ 553 అంతర్జాతీయ సిక్సర్లు బాదగా.. రోహిత్‌ శర్మ అతడిని అధిగమించేశాడు. 30 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న రోహిత్ శర్మ, వరల్డ్ కప్ మ్యాచ్‌లో మొదటి 10 ఓవర్లలోపు హాఫ్ సెంచరీ చేసిన రెండో భారత బ్యాటర్‌గా నిలిచాడు. 2003లో పాకిస్తాన్‌పై సచిన్ టెండూల్కర్ ఈ ఫీట్‌ను సాధించగా.. 20 ఏళ్ల తర్వాత రోహిత్ ఆ ఫీట్‌ని సాధించడం గమనార్హం.