IND vs AFG: శతకం బాదిన హిట్ మ్యాన్.. సచిన్ రికార్డు బ్రేక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs AFG: భారత కెప్టెన్ రోహిత్ శర్మ అఫ్గానిస్థాన్‌పై తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో మొదటి మ్యాచ్‌లో విఫలమైన హిట్ మ్యాన్.. పసికూన అఫ్గాన్‌పై శతకంతో చెలరేగిపోయాడు. మొదటి వన్డే ప్రపంచ కప్ ఆడుతున్న ఇషాన్ కిషన్ నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించినా.. మరో ఎండ్‌లో ‘హిట్ మ్యాన్’ బౌండరీలతో అఫ్గాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 63 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో రోహిత్ శర్మ సెంచరీని పూర్తి చేశాడు. అఫ్గాన్ బౌలర్ మహ్మద్ నబీ వేసిన 18 ఓవర్‌లో మొదటి బంతికి ఫోర్ బాది 99కి చేరుకున్న రోహిత్.. తర్వాత బంతికి సింగిల్ తీసి తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 63 బంతుల్లో శతకం బాది అత్యంత వేగంగా సెంచరీ పూర్తి చేసుకున్న భారత ఆటగాడిగా రికార్డును నమోదు చేశాడు. ఈ క్రమంలోనే ప్రపంచకప్‌లో ఏడో సెంచరీని తన ఖాతాలో వేసుకుని.. సచిన్(6) పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు.
Also Read: World Cup 2023: గాజాకు మద్దతుగా పాక్ క్రికెటర్ రిజ్వాన్.. సెంచరీ అంకితం.. నెటిజన్ల రియాక్షన్ ఇదే..
Also Read
- New Railway Line: రైల్వే ప్రయాణికులకు అదిరే న్యూస్.. 17 కి.మీ మేర కొత్త రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్..
- Minister Kolusu Parthasarathy: అభివృద్ధికి అడ్డంకిగా వ్యవహరిస్తున్నారు.. యువతను రౌడీయిజం వైపు ప్రోత్సహిస్తున్నారు..!
- Bankipur Results: బీజేపీ కంచుకోటలో సంచలనం.. భారీ ఆధిక్యంలో దూసుకెళ్తున్న ప్రశాంత్ కిషోర్
- 7050mAh భారీ బ్యాటరీ, 6.83 అంగుళాల కర్వ్డ్ OLED డిస్ప్లే, 50MP Sony కెమెరాతో రానున్న vivo S2.!
ఇదిలా ఉండగా.. ఫజల్ హక్ ఫారూకీ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో రెండో బంతికి సిక్సర్ బాదిన రోహిత్ శర్మ.. వరల్డ్ కప్‌లో 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అత్యంత వేగంగా 1000 వన్డే వరల్డ్ కప్ పరుగులు చేసిన బ్యాటర్‌గా డేవిడ్ వార్నర్ రికార్డును సమం చేశాడు. టీమిండియాతో మొదటి మ్యాచ్‌లో వరల్డ్ కప్‌లో 1000 పరుగులు అందుకుని, సచిన్ రికార్డు బ్రేక్ చేశాడు డేవిడ్ వార్నర్. ఆ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 22 పరుగులు చేసి ఉంటే, వార్నర్ రికార్డు కూడా బ్రేక్ అయ్యేది. అయితే ఆ మ్యాచ్‌లో రోహిత్ డకౌట్ కావడంతో వార్నర్ రికార్డు సమం మాత్రమే అయ్యింది. మరో వైపు టీమిండియా తరఫున వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాటర్‌గా రోహిత్ నిలిచాడు. సచిన్ టెండూల్కర్ 2278 వన్డే వరల్డ్ కప్ పరుగులతో టాప్‌లో ఉంటే, విరాట్ కోహ్లీ 1115 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. 1006 పరుగులు చేసిన సౌరవ్ గంగూలీని కూడా రోహిత్ శర్మ దాటేశాడు.
మరో వైపు అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రోహిత్ రికార్డు సృష్టించారు. క్రిస్ గేల్ 553 అంతర్జాతీయ సిక్సర్లు బాదగా.. రోహిత్ శర్మ అతడిని అధిగమించేశాడు. 30 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న రోహిత్ శర్మ, వరల్డ్ కప్ మ్యాచ్‌లో మొదటి 10 ఓవర్లలోపు హాఫ్ సెంచరీ చేసిన రెండో భారత బ్యాటర్‌గా నిలిచాడు. 2003లో పాకిస్తాన్‌పై సచిన్ టెండూల్కర్ ఈ ఫీట్‌ను సాధించగా.. 20 ఏళ్ల తర్వాత రోహిత్ ఆ ఫీట్‌ని సాధించడం గమనార్హం.
తాజావార్తలు
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!
-
New Railway Line: రైల్వే ప్రయాణికులకు అదిరే న్యూస్.. 17 కి.మీ మేర కొత్త రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్..
-
Minister Kolusu Parthasarathy: అభివృద్ధికి అడ్డంకిగా వ్యవహరిస్తున్నారు.. యువతను రౌడీయిజం వైపు ప్రోత్సహిస్తున్నారు..!
-
Bankipur Results: బీజేపీ కంచుకోటలో సంచలనం.. భారీ ఆధిక్యంలో దూసుకెళ్తున్న ప్రశాంత్ కిషోర్
-
7050mAh భారీ బ్యాటరీ, 6.83 అంగుళాల కర్వ్డ్ OLED డిస్ప్లే, 50MP Sony కెమెరాతో రానున్న vivo S2.!
ట్రెండింగ్
-
Mushroom Onion Pakoda: ఈజీ స్నాక్ రెసిపీ..10 నిమిషాల్లో కరకరలాడే ‘మష్రూమ్ ఆనియన్ పకోడీ’.! చేసేయండి ఇలా..
-
Mumbai Indians Captain: ముగ్గురు దిగ్గజాల సపోర్ట్.. తెలుగు ఆటగాడికి ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ!
-
ప్రీమియం ఫీచర్లు బడ్జెట్ ధరలో.. 50MP OIS కెమెరా, సూపర్ AMOLED డిస్ప్లేతో Samsung Galaxy F70 Pro 5G లాంచ్..!
-
Best Cricketing Brain: ఎంఎస్ ధోనీ కాదు, అతడే బెస్ట్ క్రికెటింగ్ బ్రెయిన్.. ఆ టీమిండియా మాజీ స్టార్ ఎవరంటే?
-
Tata దూకుడు మాములుగా లేదుగా.. Nexon నుంచి ప్రీమియం Avinya X వరకు భారీ ప్లాన్..!