IND vs NZ: టెస్ట్ సిరీస్‌ను కోల్పోవడం నిరాశపరిచింది.. ఓటమికి కారణం చెప్పిన రోహిత్
- భారత గడ్డపై 12 ఏళ్ల తర్వాత టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకున్న న్యూజిలాండ్
- భారత గడ్డపై తొలిసారిగా న్యూజిలాండ్ జట్టు టెస్టు సిరీస్‌లో విజయం
- రెండో టెస్టులో భారత్ 113 పరుగుల తేడాతో ఓటమి
- ఓటమికి గల కారణాలను వెల్లడించిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ
- ఈ ఓటమి మాకు చాలా నిరాశ కలిగించింది- రోహిత్ శర్మ
- ఈసారి మేము అనుకున్నట్లు జరగలేదు- రోహిత్ శర్మ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరే ఇతర జట్టు చేయలేని అద్భుతాన్ని న్యూజిలాండ్ జట్టు చేసింది. భారత గడ్డపై 12 ఏళ్ల తర్వాత కివీస్ జట్టు టెస్టు సిరీస్ ను సొంతం చేసుకుంది. టామ్ లాథమ్ సారథ్యంలోని కివీస్ జట్టు 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌లను గెలిచి 2-0తో టెస్ట్ సిరీస్‌ను గెలిచింది. భారత గడ్డపై తొలిసారిగా న్యూజిలాండ్ జట్టు టెస్టు సిరీస్‌లో విజయాన్ని నమోదు చేసింది. రెండో టెస్టులో భారత్ 113 పరుగుల తేడాతో ఓడిపోయింది. కాగా.. ఓటమికి గల కారణాలను టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు.
పుణె టెస్టు మ్యాచ్‌లో ఓటమి తర్వాత రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ఇది తమకు చాలా నిరాశ కలిగించిందని అన్నాడు. ఈసారి తాము అనుకున్నట్లు జరగలేదని వెల్లడించాడు. ఈ విజయం సాధించిన ఘనత తమకంటే బాగా ఆడిన న్యూజిలాండ్‌కే దక్కుతుందని పేర్కొన్నాడు. కొన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాం.. కివీస్ జట్టు సవాళ్లకు స్పందించడంలో విఫలమై ఓటమి పాలయ్యామని రోహిత్ శర్మ తెలిపాడు.
Also Read
- Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్‌కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
- TMC Rebellion: కోల్‌కతా టు ఢిల్లీ.. పార్లమెంట్‌కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
- Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
- Monsoon 2026: ఆ రాష్ట్రాలకు భారీ ముప్పు.. శని, ఆదివారాల్లో అత్యంత భారీ వర్షాలు.. ఐఎమ్‌డీ హై అలర్ట్!
Read Also: Delhi: యమునాలో స్నానం.. ఒక్క రోజులోనే ఆస్పత్రి పాలైన ఢిల్లీ బీజేపీ చీఫ్..
తాము గెలవడానికి తగినన్ని పరుగులు చేశామని తాను అనుకోను అని రోహిత్ శర్మ అన్నాడు. గెలవాలంటే 20 వికెట్లు తీయాలి.. బ్యాటర్ పరుగులు చేయాలి. కివీస్ జట్టును 250కి పరిమితం చేయడం గొప్ప పునరాగమనం.. కానీ అది తమకు సవాలుగా మారుతుందని తెలుసన్నాడు. ఇదిలా ఉంటే.. పిచ్‌లో ఎలాంటి లోపం లేదని చెప్పుకొచ్చాడు. తాము సరిగ్గా బ్యాటింగ్ చేయలేదని రోహిత్ శర్మ అన్నాడు. వాంఖడేలో జరిగే మూడో టెస్టులో మంచి ప్రదర్శన చేసి ఆ టెస్ట్ మ్యాచ్‌లో విజయం సాధించాలని తాము కోరుకుంటున్నామని చెప్పాడు. ఈ ఓటమి తమ సమిష్టి వైఫల్యం అని అన్నాడు.
తాను బ్యాట్స్‌మెన్ లేదా బౌలర్లను మాత్రమే తప్పుపట్టే వ్యక్తిని కాదు అని రోహిత్ అన్నాడు. మెరుగైన ఆలోచనలు, మెరుగైన పద్ధతులతో వాంఖడే మైదానంలో దిగుతామన్నాడు. తాను దేనిపైనా ఎక్కువ పోస్ట్‌మార్టం చేయాలనుకోనని చెప్పాడు.. తమ ప్లాన్ ప్రకారం పని చేయలేకపోయామన్నాడు. బ్యాట్స్‌మెన్‌లందరూ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది.. సరిగ్గా ఆడితే బౌలర్లపై ఒత్తిడి పెంచవచ్చని న్యూజిలాండ్ జట్టు చూపించిందన్నాడు. ప్రస్తుతం ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ గురించి ఆలోచించడం లేదని చెప్పాడు. తమ ఓటమి యూనిట్ మొత్తం ఓటమి, ఓటమికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు.
Read Also: Raashi Khanna: పెళ్లిపై రాశి ఖన్నా కీలక వ్యాఖ్యలు
- Tags
- india
- loss
- new zealand
- reasons
- reveal
తాజావార్తలు
-
Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్‌కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
-
TMC Rebellion: కోల్‌కతా టు ఢిల్లీ.. పార్లమెంట్‌కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
-
Today Gold and Silver Prices: పసిడి ధరలో భారీ పతనం.. వెండి కూడా చౌకైంది.. 22, 24 క్యారెట్ ధరలు ఎంతంటే?
-
Peddi vs Drishyam : మోహన్ లాల్‌కు “పెద్ది” దెబ్బ…. విదేశాల్లోనూ షాకే!
-
Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!