Rohit Sharma: ఆర్సీబీలోకి రోహిత్ శర్మ? ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రెడ్ జెర్సీ ఫొటో.. ఇక్కడే అసలైన ట్విస్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma: భారత క్రికెట్ దిగ్గజం రోహిత్ శర్మ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక ఎరుపు రంగు జెర్సీ ఫొటో సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ‘హిట్‌మ్యాన్’ తన తదుపరి ఐపీఎల్ ప్రాంచైజీగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వైపు మొగ్గు చూపుతున్నాడేమోనని, ఆ సంకేతాల కోసమే ఈ పిక్ ఉంచాడని అభిమానులు అంచనాలు వేశారు. అయితే, ఈ వైరల్ పిక్ వెనుక అసలు నిజం వేరే ఉంది. ఇది ఐపీఎల్ ప్రాంచైజీ మార్పునకు సంబంధించినది కాదు, ఒక భారీ గేమింగ్ అనౌన్స్మెంట్కు సంకేతం.
రోహిత్ శర్మ బెంగళూరుకు చెందిన గేమ్-టెక్ స్టూడియో ‘లైట్‌ఫ్యూరీ గేమ్స్’ (LightFury Games)లో వ్యూహాత్మక ఇన్వెస్టర్‌గా చేరాడు. పెట్టుబడితో పాటు, ఈ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతున్న ‘ఈ-క్రికెట్’ (eCricket) అనే ఏఏఏ మొబైల్ గేమ్‌లో రోహిత్ శర్మ అధికారికంగా ప్లేయబుల్ క్యారెక్టర్‌గా కనిపించనున్నాడు. సోషల్ మీడియాలో హల్చల్ చేసిన ఆ రెడ్ జెర్సీ లుక్, ఈ గేమ్‌కి సంబంధించిన ‘అల్టిమేట్ స్క్వాడ్’ మోడ్ సినిమాటిక్ టీజర్ నుంచి తీసిందే. ఈ ప్రత్యేక గేమింగ్ మోడ్‌లో 700 మందికి పైగా లైసెన్స్ పొందిన క్రికెటర్ల నుంచి ఆటగాళ్ళు తమకు నచ్చిన కలల జెర్సీలను ఎంచుకుని డ్రీమ్ టీమ్‌ను నిర్మించుకోవచ్చు.
Also Read
- India-Iran Trade: ఇరాన్‌తో చమురు వ్యాపారం.. 4 భారతీయ కంపెనీలపై అమెరికా ఆంక్షలు
- Sabari River Flood: పోలవరం జిల్లాలో శబరి నది ఉగ్రరూపం.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
- Suryapet Bus Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. బస్సు-కంటైనర్ ఢీ, ఆరుగురు మృతి
- Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
ఈ గేమ్ ప్రాజెక్టులో కేవలం రోహిత్ శర్మ లేడు. ఇప్పటికే ఎంఎస్ ధోనీ, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శ్రేయస్ అయ్యర్ వంటి ప్రముఖ భారత క్రికెట్ ఐకాన్లు కూడా ఈ స్టూడియోకు మద్దతుగా నిలిచారు. వీరి జాబితాలోకి ఇప్పుడు రోహిత్ కూడా చేరడంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు రెట్టింపయ్యాయి. లైట్‌ఫ్యూరీ గేమ్స్ సంస్థ సెప్టెంబర్ 2026లో ముందస్తు యాక్సెస్ వినియోగదారుల కోసం తమ ఫేజ్డ్ క్లోజ్డ్ బీటా టెస్టింగ్‌ను ప్రారంభించబోతోంది. అప్పుడే ఈ గేమ్ కోసం ఏకంగా 3 లక్షలకు పైగా ప్రీ-రిజిస్ట్రేషన్లు నమోదు కావడం దీనికున్న భారీ క్రేజ్‌ను తెలియజేస్తోంది. కాబట్టి ఆర్సీబీలో రోహిత్ చేరడం అనేది ఒక చిన్నపాటి పొరపాటు ఊహాగానం మాత్రమేనని స్పష్టమైంది.
తాజావార్తలు
-
Arjun Reddy: 10 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి ‘అర్జున్ రెడ్డి’.. ఎక్స్టెండెడ్ వెర్షన్‌పై సందీప్ రెడ్డి వంగా కీలక అప్డేట్
-
Rohit Sharma: ఆర్సీబీలోకి రోహిత్ శర్మ? ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రెడ్ జెర్సీ ఫొటో.. ఇక్కడే అసలైన ట్విస్ట్!
-
India-Iran Trade: ఇరాన్‌తో చమురు వ్యాపారం.. 4 భారతీయ కంపెనీలపై అమెరికా ఆంక్షలు
-
Sabari River Flood: పోలవరం జిల్లాలో శబరి నది ఉగ్రరూపం.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
-
Explainer: టార్గెట్ ఇండియా? పాక్‌కు బాంబులు పంపుతున్న టర్కీ!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!