ప్రపంచకప్ 2023లో టీమిండియా విజయాల పరంపర కొనసాగుతోంది. టీమిండియా ఆడిన 6 మ్యాచ్‌ల్లో గెలిచి 12 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఇదిలా ఉంటే.. టీమిండియా రథసారధి రోహిత్ శర్మపై పాకిస్థాన్ మాజీ దిగ్గజం వసీం అక్రమ్ పొగడ్తల జల్లు కురిపించాడు. రోహిత్ శర్మ పుట్టుకతో వచ్చిన నాయకుడని వసీం అక్రమ్ అన్నారు. ఈ ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియాను నిలువరించడం అసాధ్యమని పేర్కొన్నాడు.