Rohit Sharma Catch: గాల్లోకి ఎగిరి.. ఒంటిచేత్తో రోహిత్ స్టన్నింగ్ క్యాచ్! వీడియో చూసి తీరాల్సిందే
- రోహిత్ స్టన్నింగ్ క్యాచ్
- సోషల్ మీడియాలో వైరల్
- మొమినల్ హక్ సెంచరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma Single Hand Catch: కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు నాలుగో రోజు ఆటలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. మిడాఫ్‌లో ఊహించని క్యాచ్‌ను హిట్‌మ్యాన్ అందుకున్నాడు. రోహిత్ గాల్లోకి ఎగిరి మరీ ఒంటిచేత్తో క్యాచ్‌ను అందుకున్న తీరును చూసి.. బంగ్లాదేశ్ బ్యాటర్ లిటన్ దాస్ సహా భారత ఆటగాళ్లు సైతం నోరెళ్లబెట్టారు. రోహిత్ స్టన్నింగ్ క్యాచ్‌కు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 50వ ఓవర్‌ను మహమ్మద్ సిరాజ్ వేశాడు. సిరాజ్ వేసిన నాలుగో బంతికి లిటన్ దాస్ ముందుకు వచ్చి షాట్ ఆడాడు. మిడాఫ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ తల మీదుగా బంతి దూసుకెళుతోంది. రోహిత్ ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి.. ఒంటిచేత్తో క్యాచ్ అందుకున్నాడు. లిటన్ దాస్ అయితే షాక్ అయ్యాడు. టీమిండియా ప్లేయర్స్ అయితే నోరెళ్లబెట్టారు. యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ తన చేతులను తలపై పెట్టుకుని ఆశ్చర్యపోయాడు. తాను పట్టిన క్యాచ్‌ను హిట్‌మ్యాన్ కూడా నమ్మలేకపోయాడు. క్యాచ్ పట్టగానే సంతోషంలో పరుగులు చేశాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది.
Also Read
- Gurugram Rain: గంట వర్షానికి గురుగ్రామ్ అతలాకుతలం.. జనజీవనం అస్తవ్యస్థం
- Sugar Prices: చక్కెర ధరలపై గుడ్‌న్యూస్.. దిగిరానున్న ధరలు
- Jaishankar-Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జైశంకర్ భేటీ.. రెండు దేశాల సంబంధాలపై చర్చ
- IND vs SL 2nd Test: కొలంబో టెస్ట్‌లో భారత్ డిక్లేర్.. శ్రీలంక ముందు భారీ టార్గెట్..
Also Read: Hyundai Record: అరుదైన మైలురాయిని అందుకున్న హ్యుందాయ్!
నాలుగో రోజు లంచ్ బ్రేక్ సమయానికి బంగ్లాదేశ్ 6 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. మొమినల్ హక్ (102 నాటౌట్) సెంచరీ బాదాడు. 93, 95 పరుగుల వద్ద క్యాచ్ ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డ హక్.. తనకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని శతకం పూర్తి చేసుకున్నాడు. మెహిదీ హసన్ మిరాజ్ (6) క్రీజులో ఉన్నాడు. అశ్విన్, ఆకాష్ తలో రెండు వికెట్స్ పడగొట్టారు. గత రెండు రోజులు ఒక్క బంతి పడకుండానే ఆట రద్దైన సంగతి తెలిసిందే.
One hand, all class 🤯👌
Captain Rohit Sharma takes a stunner to dismiss Liton Das!☝️#INDvBAN #JioCinemaSports #IDFCFirstBankTestSeries pic.twitter.com/Raq8OoLAlI
— JioCinema (@JioCinema) September 30, 2024
తాజావార్తలు
-
FEFSI : కోలీవుడ్‌లో సమ్మె సైరన్‌పై ఫెఫ్సీ ఆందోళన: బంద్ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని విజ్ఞప్తి!
-
Rambha Urvashi Menaka Trailer: నవ్వులు పూయిస్తున్న అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ ట్రైలర్.. చూశారా!
-
Gurugram Rain: గంట వర్షానికి గురుగ్రామ్ అతలాకుతలం.. జనజీవనం అస్తవ్యస్థం
-
Komaram: నాతో ఉన్నవాళ్లే 15 మంది డైరెక్టర్లయ్యారు.. కానీ మీరు కొత్త జీవితాన్ని ఇచ్చారు
-
Marriage Rumours: జయరామ్ – సిమ్రాన్ పెళ్లి చేసుకున్నారా? వైరల్ అవుతున్న ఫొటోలు!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!