‘The Hundred’లో రోహిత్ శర్మ.! MI లండన్ ఘన విజయం.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma at The Hundred 2026: ఇంగ్లాండ్ తో టీమిండియా వన్డే సిరీస్ ముగిసినప్పటికీ.. ‘రోహిత్ శర్మ’ ఇంకా ఇంగ్లండ్‌లోనే ఉన్నారు. అక్కడ జరుగుతున్న ది హండ్రెడ్ (The Hundred) – 2026 టోర్నీ ప్రారంభ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించారు. జూలై 21 నుంచి ప్రారంభమైన ఈ లీగ్‌లో MI లండన్ జట్టుకు మద్దతుగా ఓవల్ స్టేడియానికి వచ్చిన రోహిత్, జట్టు యజమాని నీతా అంబానీతో కలిసి మ్యాచ్‌ను ఆస్వాదించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఓవల్ స్టేడియానికి చేరుకున్న రోహిత్ శర్మకు అభిమానులు ఘన స్వాగతం లభించింది. స్టేడియం బయట ఆయనతో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీపడ్డారు. MI లండన్ కూడా రోహిత్ స్టేడియానికి వచ్చిన వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ‘ది హండ్రెడ్ 2026’ తొలి మ్యాచ్‌లో MI లండన్, సన్‌రైజర్స్ లీడ్స్ జట్టును 7 వికెట్ల తేడాతో ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ లీడ్స్ 100 బంతులు పూర్తయ్యేలోపే 99 బంతుల్లో 143 పరుగులకు ఆలౌట్ అయింది.
Also Read
- AP Coronavirus Cases: ఏపీలో భయపెడుతోన్న కరోనా..! పర్యాటకులపై ఆంక్షలు
- CM Vijay and Trisha Controversy: ఆలయ ఉత్సవాల్లో త్రిష, విజయ్ ఫొటోలతో వివాదాస్పద ఫ్లెక్సీ.. ఇద్దరిపై కేసు
- Lalit Kumar Modi: ఐపీఎల్ 2009 ఫెమా కేసులో క్లీన్ చిట్.. ఆనందంతో డాన్స్ చేస్తూ రచ్చ రచ్చ.!
- Cyber Crime: 11వ తరగతి డ్రాపౌట్.. రూ. 64 కోట్ల సైబర్ దోపిడీ.. 18 ఏళ్ల మాస్టర్‌మైండ్ అరెస్ట్!
MI లండన్ బౌలర్ రిచర్డ్ గ్లీసన్ 19 బంతుల్లో 25 పరుగులు ఇచ్చి 4 వికెట్లు, కెప్టెన్ సామ్ కరన్ 2 వికెట్లు తీయడంతో మరొక బాల్ మిగిలి ఉండగానే సన్‌రైజర్స్ లీడ్స్ 143 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 144 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన MI లండన్‌కు ఆరంభంలో ఎదురుదెబ్బ తగిలింది. 44 బంతుల్లో 51 పరుగులకే విల్ జాక్స్, జేమ్స్ విన్స్, జేసన్ రాయ్ వికెట్లు కోల్పోయింది.
అయితే ఆ తర్వాత నికోలస్ పూరన్, సామ్ కరన్ అద్భుతంగా ఆడారు. ఇద్దరూ కలిసి కేవలం 40 బంతుల్లోనే అజేయంగా 93 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి రికార్డు సృష్టించారు. ఇది MI లండన్ తరఫున నాలుగో వికెట్‌కు నమోదైన అత్యధిక భాగస్వామ్యం ఇదే. నికోలస్ పూరన్ కేవలం 22 బంతుల్లోనే 5 సిక్సర్లు, 5 ఫోర్లతో 58 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరోవైపు కెప్టెన్ సామ్ కరన్ 39 బంతుల్లో 60 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ పార్ట్నర్షిప్ కు MI లండన్ ఇంకా 16 బంతులు మిగిలి ఉండగానే.. కేవలం 84 బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని ఖాయం చేసుకుంది.
బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించడంతో పాటు ఫీల్డింగ్‌లో కూడా రెండు అద్భుతమైన క్యాచ్‌లు పట్టిన నికోలస్ పూరన్ కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. పూరన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో MI లండన్ ‘ది హండ్రెడ్ 2026’ సీజన్‌ను విజయంతో ప్రారంభించింది.
Lord's ➡️ The Oval
The Hitman is in attendance for the season opener! 😍#TheHundred 2026 👉 MI London vs Sunrisers Leeds | LIVE NOW! pic.twitter.com/5I9xYzOxrz
— Star Sports (@StarSportsIndia) July 21, 2026
తాజావార్తలు
-
‘The Hundred’లో రోహిత్ శర్మ.! MI లండన్ ఘన విజయం.!
-
Trump 200% Tariff: ట్రంప్ సంచలన నిర్ణయం.. జెనరిక్ మందులపై 200% టారిఫ్.. భారత ఫార్మా పరిశ్రమపై భారీ ప్రభావం?
-
AP Coronavirus Cases: ఏపీలో భయపెడుతోన్న కరోనా..! పర్యాటకులపై ఆంక్షలు
-
NBK : ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్‌కు బాలయ్య.. షూటింగ్ కు బ్రేక్
-
India Test Squad: శ్రీలంకతో టెస్టు సిరీస్.. టీమిండియాలోకి మరో కొత్త ప్లేయర్!
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్‌టాప్‌లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!