తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడు బ్రాహ్మజీ పేరుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది.. నటుడుగా, విలన్ గా, కమెడియన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. తన కామెడీకి ఫ్యాన్స్ కూడా ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు బ్రహ్మాజీ క్రేజ్ ఏంటో.. సీనియర్ నటుడు గా ఉన్న బ్రహ్మాజీ గురించి చాలా మందికి తెలియదు.. మొన్నీమధ్య తన పెళ్లి గురించి సంచలన విషయాలను బయట పెట్టాడు.. అది ఎంతగా వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పానక్కర్లేదు.. ఇప్పుడు మరో సీక్రెట్ ను బయట పెట్టాడు.. అతను ఇంత యంగ్ గా ఉండటానికి సీక్రెట్ ఏంటో రివిల్ చేశారు.. అది కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది..
తెలుగులో సింధూరం చిత్రంలో హీరోల్లో ఒకడిగా ఎంట్రీ ఇచ్చి, నెగెటివ్ రోల్స్,కామెడీ రోల్స్ తో కూడా మెప్పించగల నటుడు బ్రహ్మాజీ.. ఇతడి పూర్తిపేరు సత్య వెంకట సుబ్రహ్మణ్య బ్రహ్మాజీరావు. అయితే సింపుల్ గా బ్రహ్మాజీ అని అందరూ పిలవడంతో వెండితెరపై కూడా అదేపేరుతో కంటిన్యూ అయ్యాడు. నిన్నే పెళ్లాడతా, ఖడ్గం,ఏక్ నిరంజన్ , అతడు,మర్యాద రామన్న వంటి చిత్రాలలో తన నటనతో జనానికి బాగా దగ్గరయ్యాడు. డైలాగ్ డెలివరీ లో కూడా ఆరితేరాడు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు చెందిన బ్రహ్మాజీ తండ్రి తహసీల్దార్ గా చేసేవారు. ఇక తల్లి అమలాపురం దగ్గర అద్దంకివారి లంక కు చెందిన వారు. బ్రహ్మాజీ కి నలుగురు అక్కలు, ఓ అన్నయ్య ఉన్నారు. ఇతడి స్టడీస్ ఏలూరులో జరిగింది.. ఆ తర్వాత సినిమాల్లోకి రావడం జరిగింది..
ఒక్కో సినిమాతో తన పాపు్లారిటీ పెంచుకుంటూ వస్తున్నాడు.. బ్రాహ్మజీ నిత్యం ఏదొక ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇస్తారు.. అంతేకాదు బుల్లితెరపై ప్రసారం అవుతున్న పలు షోలలో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంటాడు..అయితే తాజాగా బ్రాహ్మజీ ఓ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు.. ఎస్ ఇంటర్వ్యూ లో యాంకర్ అడిగిన ప్రతి ప్రశ్నలకు చాలా ఓపిగ్గా సమాధానం ఇచ్చాడు.. అయితే బ్రాహ్మజీ యంగ్ లుక్ వెనుక రహస్యం గురించి చెప్పాడు.. ఆవు మూత్రన్ని ప్రతి రోజూ సేవిస్తానని చెప్పుకొచ్చాడు.. అది కాస్త నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం రెండు మూడు సినిమాలు చేస్తున్నట్లు చెప్పారు..