Neru : ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న మలయాళ సూపర్ హిట్ మూవీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓటీటీ లు అందుబాటులోకి వచ్చిన తరువాత భాష తో సంబంధం లేకుండా వరుస సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి. ముఖ్యంగా మలయాళం సినిమాలు ప్రేక్షకులకు తెగ నచ్చేస్తున్నాయి.మాలీవుడ్‌లో సూపర్‌హిట్ సాధించిన సినిమాలెన్నో ఓటీటీలో బంపర్ స్ట్రీమింగ్ నమోదు చేసుకుంటున్నాయి.తాజాగా అలా అలరిస్తున్న మరో మలయాళ చిత్రమే ‘నెరు’. ఈ చిత్రాన్ని దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించారు.సీరియస్ పాయింట్‌కు కోర్డు డ్రామా జతకలిపి ఆద్యంతం ఆసక్తికరంగా మలచడంలో దర్శకుడు జీతూ జోసెఫ్ సక్సెస్ సాధించాడు. దృశ్యం, దృశ్యం-2 సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సృష్టించుకున్న జీతూ ‘నెరు’ మూవీతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే సారా మహ్మద్ (అనశ్వర రాజన్) ఒక అంధురాలు. గుర్తుతెలియని వ్యక్తి ఆమెపై అత్యాచారం చేస్తాడు. మట్టితో శిల్పాలు చేయడంలో సిద్ధహస్తురాలైన సారా.. తనపై అత్యాచారం చేసిన వ్యక్తి శిల్పాన్ని చేస్తుంది. దాని ఆధారంగా పోలీసులు మైఖేల్ జోసెఫ్ (శంకర్)ను అరెస్టు చేస్తారు. మైఖేల్ ధనవంతుల బిడ్డ.అతణ్ని కాపాడుకోవడానికి మైఖేల్ తండ్రి పేరుమోసిన క్రిమినల్ లాయర్ రాజశేఖర్ (సిద్దిఖ్)ను రంగంలోకి దించుతాడు. అంధురాలు తనపై అత్యాచారం చేసిన వ్యక్తిని ఎలా శిల్పంగా చేస్తుందని వాదించి, నిందితుడికి బెయిల్ వచ్చేలా చేస్తాడు రాజశేఖర్. మరోవైపు సారా తరఫున కోర్టులో వాదించడానికి ఏ లాయరూ కూడా ముందుకురాడు. పోలీసుల సూచన మేరకు సారా కేసు తీసుకోవాల్సిందిగా ఆమె తండ్రి… లాయర్ విజయ్ మోహన్ (మోహన్‌లాల్)ను ఆశ్రయిస్తాడు. చాలా రోజులుగా ప్రాక్టీస్‌కు దూరంగా ఉన్న విజయ్ సారా కథ విన్నాక ఆమె తరఫున వాదించడానికి ఒప్పుకుంటారు.ఇంతకీ సారాపై అత్యాచారం చేసింది ఎవరు?..విజయ్ మోహన్ కేసు ఒప్పుకొన్న తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి?..విజయ్‌కి, రాజశేఖర్ కూతురు పూర్ణిమ (ప్రియమణి)కి ఉన్న సంబంధం ఏంటి?.. అనేది ఈ సినిమా మిగిలిన కథ.మొదటి పది నిమిషాల్లో కథ తెలిసిపోయినా సరే నేరాన్ని నిరూపించడం ఎలా నడిపించారన్నది ఆసక్తికరంగా తెరకెక్కించారు.
Also Read
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?