Cyclone Akvan: దూసుకొస్తున్న అక్వాన్ తుఫాన్.. తీరం దాటేది ఇక్కడే..! అత్యంత భారీ వర్షాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyclone Akvan: బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం వైపు దూసుకొస్తోంది. ప్రస్తుతం ఈ తుఫాన్ నెమ్మదిగా కదులుతున్నప్పటికీ, క్రమంగా బలపడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. గత ఆరు గంటల్లో గంటకు కేవలం 3 కిలోమీటర్ల వేగంతో కదిలినట్లు తెలిపింది. బుధవారం ఉదయానికి తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. ప్రస్తుతం అక్వాన్ తుఫాన్ చెన్నైకి 590 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 620 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 620 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 750 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా ప్రయాణిస్తూ గురువారం సాయంత్రానికి అతి తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
ఇక, శుక్రవారం మధ్యాహ్నానికి నెల్లూరు – విశాఖపట్నం మధ్య తుఫాన్ తీరం దాటే అవకాశముంది. తీరం దాటే సమయంలో గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉండగా, గరిష్ఠంగా గంటకు 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. తుఫాన్ ప్రభావంతో గురువారం, శుక్రవారం కోస్తా ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. రైతులు వ్యవసాయ పనుల విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, పంటలు, వ్యవసాయ ఉత్పత్తుల రక్షణకు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరింది.
Also Read
- Cyclone Akwan: దూసుకొస్తున్న అక్వాన్ తుఫాన్.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
- ZP Chairman Elections: జెడ్పీ చైర్మన్ పదవులపై ఉత్కంఠ.. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య ఇంకా రాని క్లారిటీ..!
- CM Chandrababu Delhi Tour: మరోసారి ఏపీ సీఎం హస్తిన బాట.. కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలు
- Cyclone Akwan Alert: అతి తీవ్ర తుఫాన్‌గా అక్వాన్.. తీర ప్రాంత ప్రజలకు హెచ్చరికలు జారీ
విద్యుత్ శాఖ కంట్రోల్ రూమ్ నంబర్లు విడుదల
మరోవైపు అక్వాన్ తుఫాన్ నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే వెంటనే స్పందించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ నంబర్లను ఏర్పాటు చేసింది. అత్యవసర విద్యుత్ సేవల కోసం ప్రజలు టోల్ ఫ్రీ నంబర్ 1912కు ఫోన్ చేయవచ్చని అధికారులు తెలిపారు.
జిల్లాల వారీగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే:
* కృష్ణా జిల్లా: 6281709355
* ఎన్టీఆర్ జిల్లా: 9440817561
* గుంటూరు: 9440817526
* బాపట్ల: 9281413774
* ప్రకాశం: 9440817491
* పల్నాడు: 7382623148
* మార్కాపురం: 7780420711
* APCRDA: 8331092947
తుఫాన్ సమయంలో విద్యుత్ స్తంభాలు, తెగిపడిన విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని, ఎలాంటి విద్యుత్ సమస్యలు ఎదురైనా స్వయంగా మరమ్మతులు చేయకుండా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ప్రజలు అధికారుల సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
200MP+200MP కెమెరాలు, IP66+IP68+IP69 రేటింగ్స్, 7,050mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ Xiaomi 18 Pro Max లాంచ్..!
-
MS Dhoni IPL Retirement: నా ఆలోచన తప్పు అని ఫాన్స్ నిరూపించారు.. ఎంఎస్ ధోనీ ఎమోషనల్ పోస్ట్!
-
Cyclone Akvan: దూసుకొస్తున్న అక్వాన్ తుఫాన్.. తీరం దాటేది ఇక్కడే..! అత్యంత భారీ వర్షాలు..
-
SAFF Championship 2026: తొలిసారి ఫైనల్‌కు చేరిన పాకిస్థాన్‌కు షాక్.. SAFF ఛాంపియన్షిప్ 2026 విజేతగా భారత్
-
Astrology: నవంబర్ 18 బుధవారం దినఫలాలు.. ఈ రాశులవారు ఈ పూజ మాత్రం మరవొద్దు..!
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్‌ఫోన్..!