Russia Plane Crash: రష్యాలో ఘోర విషాదం.. గాల్లోనే అదుపుతప్పిన An-12 విమానం.. 19 మంది బలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia Plane Crash: రష్యాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. పశ్చిమ సైబీరియాలోని కెమెరోవో ప్రాంతంలో రష్యా సైన్యానికి చెందిన An-12 రవాణా విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలోని సిబ్బందితో సహా మొత్తం 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం జరిగిన ఈ దుర్ఘటనను రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. ప్రాథమిక విచారణలో విమానంలోని సాంకేతిక పరికరాల్లో తలెత్తిన లోపమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ప్రమాదానికి అసలు కారణం ఏమిటన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. దీనిపై సమగ్ర విచారణ కొనసాగుతోంది.
రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. An-12 సైనిక రవాణా విమానం మంగళవారం కెమెరోవో ప్రాంతంలోని యాగునోవో గ్రామం సమీపంలో కూలిపోయింది. జనసంచారం లేని ప్రాంతంలో విమానం కూలిపోవడంతో నేలపై ఉన్న ఇతరులకు ఎలాంటి ప్రాణనష్టం జరిగలేదని తెలిపారు. ప్రమాద సమయంలో విమానంలో పైలట్లు, ఇతర సిబ్బందితో కలిపి మొత్తం 19 మంది ఉన్నారు. దురదృష్టవశాత్తూ వారిలో ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేదు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు రష్యా వైమానిక దళానికి చెందిన నిపుణులకు విచారణ బాధ్యతలు అప్పగించారు.
Also Read
- US Iran Tensions: హార్ముజ్ జలసంధిపై అమెరికా LUCAS డ్రోన్ కూల్చివేసిన ఇరాన్!
- Bangladesh: ఢాకా ఎయిర్‌పోర్టు సమీపంలో బాంబు పేలుళ్లు.. షేక్ హసీనా రాకపై ఉత్కంఠ!
- Quad Summit: మోడీ ‘‘టఫ్ మ్యాన్’’.. ప్రధానిపై ట్రంప్ ప్రశంసలు!
- Kim Jong Un: ట్రంప్‌తో భేటీ వార్తలు.. స్టైల్‌గా సిగరెట్ తాగుతూ కిమ్ జోంగ్ ఉన్ ప్రత్యక్షం!
ఈ ప్రమాదం రష్యా రాజధాని మాస్కోకు సుమారు 3,000 కిలోమీటర్ల తూర్పున ఉన్న పశ్చిమ సైబీరియా ప్రాంతంలో చోటుచేసుకుంది. కెమెరోవో ప్రాంతంలోని యాగునోవో గ్రామ సమీపంలో విమానం కూలిపోయింది. ప్రాథమిక సమాచారం ప్రకారం విమానంలోని సాంకేతిక వ్యవస్థల్లో లోపం తలెత్తి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. విమానం ప్రయాణిస్తున్న సమయంలో ఏయే పరికరాలు పనిచేయలేదు? పైలట్లు విమానంపై నియంత్రణ ఎందుకు కోల్పోయారు? అనే అంశాలపై నిపుణులు దర్యాప్తు చేస్తున్నారు.
An-12 అనేది సోవియట్ యూనియన్ కాలంలో రూపొందించిన సైనిక రవాణా విమానం. ఇందులో నాలుగు టర్బోప్రాప్ ఇంజిన్లు ఉంటాయి. సైనికులను, యుద్ధ పరికరాలను, ఇతర అవసరమైన సామగ్రిని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించేందుకు దీనిని రూపొందించారు. 1950వ దశకం చివరి కాలం నుంచి ఈ విమానాలు సేవలందిస్తున్నాయి. సాధారణంగా An-12 విమానంలో ఆరుగురు సిబ్బంది ఉంటారు. ఈ విమానానికి చెందిన 1,000కు పైగా మోడళ్లను తయారు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం కూడా రష్యాతో పాటు ప్రపంచంలోని పలు దేశాలు ఈ విమానాలను సైనిక రవాణా అవసరాల కోసం వినియోగిస్తున్నాయి.
🚨 BREAKING ; A Russian Air Force An-12 military cargo aircraft has crashed near Yagunovo in the Kemerovo region of Siberia. Russia’s Defence Ministry has confirmed that all 19 people on board were killed. A technical malfunction is currently suspected.. https://t.co/ffYGFr1x4m
— The Wider Front 👁️🗨️ (@WiderFrontHQ) November 17, 2026
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
Russia Plane Crash: రష్యాలో ఘోర విషాదం.. గాల్లోనే అదుపుతప్పిన An-12 విమానం.. 19 మంది బలి
-
200MP+200MP కెమెరాలు, IP66+IP68+IP69 రేటింగ్స్, 7,050mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ Xiaomi 18 Pro Max లాంచ్..!
-
MS Dhoni IPL Retirement: నా ఆలోచన తప్పు అని ఫాన్స్ నిరూపించారు.. ఎంఎస్ ధోనీ ఎమోషనల్ పోస్ట్!
-
Cyclone Akvan: దూసుకొస్తున్న అక్వాన్ తుఫాన్.. తీరం దాటేది ఇక్కడే..! అత్యంత భారీ వర్షాలు..
-
SAFF Championship 2026: తొలిసారి ఫైనల్‌కు చేరిన పాకిస్థాన్‌కు షాక్.. SAFF ఛాంపియన్షిప్ 2026 విజేతగా భారత్
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్‌ఫోన్..!