Site icon NTV Telugu

Tejashwi Yadav: తృటిలో తప్పించుకున్న తేజస్వి యాదవ్.. ముగ్గురు భద్రతా సిబ్బంది గాయాలు..

Tejashwi Yadav

Tejashwi Yadav

బీహార్‌లో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జెడి) నాయకుడు తేజస్వి యాదవ్ తృటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. తేజస్వి యాదవ్ కాన్వాయ్‌లోకి ప్రవేశించిన ఓ ట్రక్కు ఎస్కార్ట్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. రాత్రి 1:30 గంటల ప్రాంతంలో తేజస్వి యాదవ్ మాధేపుర నుంచి పాట్నాకు తిరిగి వస్తున్నారు. జాతీయ రహదారిపై టీ తాగడానికి ఆగారు. తేజస్వి తన అధికార ప్రతినిధి శక్తి యాదవ్, కొంతమంది ఆర్జేడీ నాయకులతో కలిసి కారు దిగగానే వేగంగా వస్తున్న ట్రక్కు కాన్వాయ్‌లోకి ప్రవేశించి కాన్వాయ్‌లోని ఒక వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భద్రత కోసం మోహరించిన ముగ్గురు సిబ్బంది గాయపడ్డారు. తేజస్వి యాదవ్ వెంటనే వారిని హాజీపూర్‌లోని సమీపంలోని సదర్ ఆసుపత్రికి తరలించారు.

READ MORE: RBI Gold Loan Rules: గోల్డ్ లోన్ కోసం ఆర్‌బిఐ కొత్త రూల్స్.. ఇప్పుడు బంగారం విలువలో ఎంత శాతం రుణం పొందొచ్చంటే?

ప్రమాదం గురించి తేజస్వి యాదవ్ ఏమన్నారు?
తేజస్వి యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. ” మేము ఓ కార్యక్రమాన్ని ముగించుకుని మాధేపుర నుంచి తిరిగి వస్తున్నాం. మధ్యలో టీ తాగడానికి ఆగాం. ఓ ట్రక్కు అదుపు తప్పి నా ముందు ఉన్న 2-3 వాహనాలను ఢీకొట్టింది. మా భద్రతా సిబ్బంది నిలబడి ఉన్నారు. వాహనం వారిని కూడా ఢీకొట్టింది. 2-3 మంది గాయపడ్డారు. కొంచెం అ జాగ్రత్తగా ఉంటే నాకు కూడా ప్రమాదం జరిగి ఉండేది. ఈ సంఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలి.” అని ఆయన వ్యాఖ్యానించారు.

READ MORE: Elon Musk: అమెరికాలో కొత్త పార్టీ.. మస్క్‌ వాదనకు 80% మద్దతు..!

Exit mobile version