ఇండోర్‌లో ఓ ట్రక్కు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్.. ట్రక్కును జనాలపైకి దూసుకుపోనిచ్చాడు. దీంతో అక్కడికక్కడే ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. ప్రమాద స్థలిలో ఆర్తనాదాలు మిన్నంటాయి.
బీహార్‌లో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జెడి) నాయకుడు తేజస్వి యాదవ్ తృటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. తేజస్వి యాదవ్ కాన్వాయ్‌లోకి ప్రవేశించిన ఓ ట్రక్కు ఎస్కార్ట్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. రాత్రి 1:30 గంటల ప్రాంతంలో తేజస్వి యాదవ్ మాధేపుర నుంచి పాట్నాకు తిరిగి వస్తున్నారు.
Lorry Accident: హబ్సిగూడలో నిన్న సాయంత్రం లారీ ప్రమాదానికి గురి అయిన బాలిక కామేశ్వరి సీసీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా లారీ డ్రైవర్ ను పోలీసులు అదుపులో తీసుకున్నారు.