బీహార్‌లో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జెడి) నాయకుడు తేజస్వి యాదవ్ తృటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. తేజస్వి యాదవ్ కాన్వాయ్‌లోకి ప్రవేశించిన ఓ ట్రక్కు ఎస్కార్ట్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. రాత్రి 1:30 గంటల ప్రాంతంలో తేజస్వి యాదవ్ మాధేపుర నుంచి పాట్నాకు తిరిగి వస్తున్నారు.