Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Rishabh Pant Injured Again Ahead Of New Zealand Odi Series

Rishabh Pant: అయ్యో.. రిషబ్ పంత్ మళ్లీ గాయపడ్డాడే!

Published Date :January 10, 2026 , 7:44 pm
By Shiva Ganesh
Rishabh Pant: అయ్యో.. రిషబ్ పంత్ మళ్లీ గాయపడ్డాడే!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Rishabh Pant: న్యూజిలాండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ రేపటి (జనవరి 11న) నుంచి ప్రారంభం కానుంది. కానీ ఈ టైంలో టీమిండియా అభిమానులకు ఒక బ్యాడ్ న్యూస్. స్టార్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ నెట్ ప్రాక్టీస్ సమయంలో గాయపడ్డాడు. పలు నివేదికల ప్రకారం.. ప్రాక్టీస్ టైంలో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, పంత్ నడుము పైన (నడుము దగ్గర) దెబ్బ తగిలినట్లు సమాచారం.

READ ALSO: Andhra Pradesh Census: ఏపీలో జన గణన కసరత్తు ప్రారంభం.. అడ్డుకుంటే జైలుకే..!

రిషబ్ పంత్ దాదాపు 50 నిమిషాల పాటు నెట్స్‌లో శ్రద్ధగా ప్రాక్టీస్ చేశాడు. ఆ టైంలో దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నా పంత్‌కు అనుకోకుండా ఒక బంతి నడుము దగ్గర తీవ్రంగా తగిలింది. ఇప్పటి వరకు గాయం తీవ్రతపై అధికారిక ప్రకటన రానప్పటికీ, జట్టు యాజమాన్యం అతని పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. సిరీస్‌కు ముందు ఆటగాళ్ళు తమ ఫిట్‌నెస్, ఫామ్‌ను నిరూపించుకుంటున్న టైంలో ఈ సంఘటన జరిగింది.

నిజానికి టీమిండియాలో రిషబ్ పంత్ కీలక ఆటగాడు. జట్టులో పంత్, కెఎల్ రాహుల్ తర్వాత రెండవ వికెట్ కీపర్‌గా ఉన్నాడు. ఈ గాయం జట్టుకు పెద్ద తలనొప్పిగా మారవచ్చని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టీమిండియా ఇప్పుడు పంత్ కోలుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. గాయం తీవ్రంగా లేకపోతే, రిషబ్ త్వరలో జట్టులోకి తిరిగి రావచ్చని సమాచారం. కానీ ఒకవేళ విశ్రాంతి అవసరమైతే, పంత్ ఫస్ట్ మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ సిరీస్‌లోని మొదటి మ్యాచ్ వడోదరలో జరగనుంది. పంత్ గాయం గురించి జట్టు యాజమాన్యం త్వరలో అధికారిక ప్రకటన విడుదల చేస్తుందని అందరూ భావిస్తున్నారు.

ఇంగ్లాండ్ పర్యటనలో కూడా..
గతంలో పంత్ 2025 ఇంగ్లాండ్ పర్యటనలో కూడా గాయాల బారినపడ్డాడు. ఈ పర్యటనలో పంత్ లార్డ్స్ టెస్ట్ సమయంలో వేలికి గాయం కావడంతో, అలాగే మాంచెస్టర్ టెస్ట్ మొదటి రోజున కుడి పాదానికి తీవ్ర గాయం అయింది. ఆ టైంలో పంత్‌ను గోల్ఫ్ కార్ట్ ద్వారా మైదానం నుంచి బయటికి తీసుకెళ్లాల్సి వచ్చింది. స్కాన్లలో కాలి బొటనవేలు విరిగినట్లు తేలింది, దీని వల్ల పంత్ కొంతకాలం క్రికెట్ మైదానానికి దూరంగా కూడా ఉన్నాడు. తాజాగా పంత్ మళ్లీ గాయం బారిన పడటం టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బగా విశ్లేషకులు చెబుతున్నారు.

READ ALSO: Bangladesh: బంగ్లాదేశ్ రాజకీయాల్లో సరికొత్త శకం.. బీఎన్‌పీకి కొత్త చీఫ్

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • INDIA Vs New Zealand ODI Series
  • Indian Cricket Team News
  • Pant injured during practice
  • Pant latest injury
  • Rishabh Pant fitness news

తాజావార్తలు

  • Ustad Bhagath Singh : ఉస్తాద్‌ భగత్‌సింగ్‌కు భారీ ఓపెనింగ్స్‌ వుండవా?

  • Bus Fire Accident: స్లీపర్ బస్సుకు మంటలు.. బయటకు దూకి ప్రాణాలు దక్కించుకున్న ప్రయాణికులు.!

  • Daily Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారు అప్పు తీర్చేస్తారు!

  • PM Modi: సామాన్యులకు బిగ్ రిలీఫ్.. దేశంలో ఇంధన సంక్షోభంపై ప్రధాని మోడీ క్లారిటీ!

  • Cinema : రూ. 9 కోట్ల బడ్జెట్‌తో తీస్తే ఏకంగా రూ. 50 కోట్లు వసూలు చేసింది

ట్రెండింగ్‌

  • Soft Idli Tips : దూది లాంటి మెత్తటి ఇడ్లీల కోసం చిట్కాలు.. పప్పు, బియ్యం ఎంతసేపు నానబెట్టాలో తెలుసా.?

  • Save Your Food: వేసవిలో అన్నం పాడవకుండా ఉండేలా సింపుల్‌ చిట్కా..!

  • 3.2K డిస్‌ప్లే, డాల్బీ ఆటమ్స్ స్పీకర్స్ వంటి పవర్‌ఫుల్ ఫీచర్లతో Xiaomi Pad 8 లాంచ్.. ధర ఎంతంటే.?

  • Basil Joseph: బ్రో.. నువ్వు ఓ ఫేమస్ హీరో గుర్తుందా..? రోడ్డుపై ఆ అల్లరేంటి.? వీడియో వైరల్..

  • రూ.10,999కే 6300mAh భారీ బ్యాటరీ, HD+ డిస్‌ప్లేతో POCO C85x 5G లాంచ్.. ఫీచర్స్ ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions