Andhra Pradesh Census: ఏపీలో జన గణన కసరత్తు ప్రారంభం.. అడ్డుకుంటే జైలుకే..!
- ఏపీలో జన గణన కసరత్తు ప్రారంభం..
- జన గణన అధికారుల్ని నియమిస్తూ ఉత్తర్వులు..
- జిల్లా, సబ్ డివిజనల్, సబ్ జిల్లాల స్థాయిలో జనగణనకు కమిటీలు..
- విధుల్ని అడ్డుకుంటే జరిమానా, జైలు శిక్ష విధించేలా ఉత్తర్వులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh Census: దేశవ్యాప్తంగా జనగణనకు సిద్ధమవుతోంది ప్రభుత్వం.. తొలిసారిగా డిజిటల్ విధానంలో జనగణన జరగబోతోంది.. తొలి విడతలో భాగంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో.. ఏప్రిల్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ వరకు ఇళ్ల వివరాలను సేకరించబోతున్నారు.. తొలిదశలో హౌస్ లిస్టింగ్, గణన ఈ ఏడాది ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య జరగనుండగా.. రెండో దశలో జనాభా లెక్కల సేకరణ వచ్చే ఏడాది అంటే.. 2027 ఫిబ్రవరి- మార్చి వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.. ఇక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనగణన కసరత్తు అధికారికంగా ప్రారంభమైంది. ఈ మేరకు జనగణన అధికారుల నియామకానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జనగణనను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా, సబ్‌డివిజనల్, సబ్‌డిస్ట్రిక్ట్ స్థాయిల్లో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
Read Also: Sajjala Ramakrishna Reddy: 175 నియోజకవర్గాల్లో వెంటనే ప్రారంభించండి.. సజ్జల కీలక ఆదేశాలు
Also Read
- Bay of Bengal Cyclone Alert: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్
- AP Drought Mandals 2026: కరువు కోరల్లో ఏపీ.. 21 జిల్లాల్లో 388 మండలాలు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
- Amaravati Construction: అమరావతి నిర్మాణంలో కీలక సమస్య..! కార్మికులపై అధికారుల దృష్టి
- AP Liquor Shops: మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంపు.. ఫీజులు, తేదీలు ఇవే
అలాగే పట్టణాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా కూడా జనగణన కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా జనగణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించడమే లక్ష్యంగా ఈ ఏర్పాట్లు చేపట్టినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. జనగణన అధికారుల విధులను అడ్డుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. జనగణన విధుల్లో అంతరాయం కలిగిస్తే జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించేలా ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొంది. ప్రజలు జనగణనకు పూర్తి సహకారం అందించాలని, సరైన సమాచారం అందించడం ద్వారా రాష్ట్రాభివృద్ధికి తోడ్పడాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. జనగణన ద్వారా లభించే డేటా భవిష్యత్తు విధానాల రూపకల్పనకు కీలకంగా ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్థాయిల్లో సమన్వయంతో జనగణన కసరత్తు చేపట్టాలని, ఎలాంటి లోపాలు లేకుండా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
తాజావార్తలు
-
October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
-
SH-93 Hindi Signboard Row: SH-93 హైవే బోర్డుపై హిందీ అక్షరాలు.. ఇద్దరు అధికారులు సస్పెండ్
-
Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
-
Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
-
BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!