కాంతారా సినిమాతో హీరోగా భారీ సక్సెస్ ను అందుకున్న హీరో రిషబ్ శెట్టి.. ఆ ఒక్క సినిమాతో అతనిపేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. కన్నడలో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది.. అంతేకాదు బాక్సాఫీస్ రికార్డులను అందుకుంది.. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయిన ఈ సినిమాకు సినీ ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. కన్నడలో స్థానిక భూత కోలా క్రీడ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.
కాంతార సూపర్ హిట్ కావడంతో ప్రస్తుతం ప్రీక్వెల్ రూపొందించే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ‘కాంతారా చాప్టర్- 1′ ఫస్ట్ గ్లింప్స్ మేకర్స్ విడుదల చేశారు.. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా రేంజులో విడుదల చేయనున్నారు మేకర్స్.. కాగా, కాంతారా హీరో రిషబ్ శెట్టి భార్య ప్రగతి పుట్టినరోజు ఈరోజు.. తన భార్యకు స్పెషల్ విషెస్ చెబుతూ ఒక వీడియోను రిలీజ్ చేశాడు.. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది..
బర్త్ డే రోజు తన భార్య ప్రగతికి గుర్తుండిపోయేలా శుభాకాంక్షలు తెలిపారు. రిషబ్ తన ఇన్‌స్టాలో రాస్తూ..’నా బర్త్ డే గర్ల్‌ఫ్రెండ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ ఆనందం ఒక వరంలా ఉండనివ్వండి. ఈ బంధం చిరస్థాయిగా నిలిచిపోనివ్వండి. మీ ఆయురారోగ్యాలు, మా ఆప్యాయత ఎల్లప్పుడూ పెరుగుతూనే ఉంటాయి.’ అంటూ పోస్ట్ చేశారు… ఆ పోస్ట్ చూస్తేనే తెలుస్తుంది రిషబ్ కు తన భార్య అంటే ఎంత ప్రేమో..వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతుంది..