FIFA World Cup: ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిపా ప్రపంచకప్ పోటీల్లో మొరాకోతో జరిగిన మ్యాచ్ లో బెల్జియం ఓటమి పాలైంది. తన ప్రత్యర్థి మొరాకో తల పడగా బెల్జియం 0-2 తేడాతో ఓడిపోయింది. దీంతో మొరాకో జెండా కప్పుకున్న అభిమానులు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. ఈ ఘటన బ్రసెల్స్‌లోని పలు ప్రాంతాల్లో అల్లర్లకు కారణమైంది. కొందరు దుకాణాల అద్దాలను పగలగొట్టారు. వాహనాలను తగలబెట్టారు. దీంతో ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు వాటర్ కేనన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. అల్లర్లకు సంబంధించి 11 మందిని అరెస్ట్ చేశారు.
Read Also: Mobile Tower Stolen In Bihar: అసలుసిసలు దొంగతనమంటే ఇదీ.. పట్టపగలే సెల్ టవర్ చోరీ
ఫేవరెట్‌లలో ఒకటిగా ప్రపంచ రెండో ర్యాంకర్ బెల్జియం బరిలోకి దిగింది. ప్రపంచ టాప్ జాబితాలో 22వ ర్యాంకర్‌గా ఉన్న మొరాకో చేతిలో ఓడిపోవడంతో బెల్జియం అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. గ్రూప్-‘ఎఫ్’లో భాగంగా ఆదివారం అల్-తుమామా స్టేడియంలో జరిగిన పోరులో మొరాకో బెల్జియంపై విజయం సాధించింది. ఆ తర్వాతనే మొరాకో అభిమానులు రోడ్లపైకి వచ్చి ఆనందంలో బాణాసంచా కాల్చారు. ఇదే ఇప్పుడు అక్కడ అల్లర్లు సృష్టించింది. అభిమానులు కొందరు దుకాణాల అద్దాలను పగలగొట్టారు. వాహనాలను తగలబెట్టారు.
Read Also: Kanpur Man Threatens Minor: పెళ్లి చేసుకుంటావా.. లేదా ముక్కలుగా నరికేయాలా?
ప్రజా భద్రతకు విఘాతం కలిగిందని పోలీసులు తెలిపారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు వాటర్ కేనన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. అల్లర్లకు సంబంధించి 11 మందిని అరెస్ట్ చేశారు. దీంతో కొందరు అభిమానులు కర్రలతో కనిపించారని, రోడ్లపై బాణసంచా కాల్చడంతో ఓ జర్నలిస్టుకు గాయాలయ్యాయని ప్రకటించారు. పలు ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగడంతో అప్రమత్తమైన పోలీసులు ఆయా ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ప్రజలు బయటకు రావొద్దని సూచించారు. ముందు జాగ్రత్త చర్యగా మెట్రో స్టేషన్లను మూసివేశారు.
Joie dans les rues de Paris après la victoire du Maroc ! 🇲🇦#BELMAR #Maroc #MARBEL pic.twitter.com/CDwYML1b6M
— Remy Buisine (@RemyBuisine) November 27, 2022
Bruxelles c’est devenu n’importe quoi tu peux être heureux pour du foot mais là ça dépasse les limites pic.twitter.com/IDziperdPq
— Arobaise 🇨🇴🥸 (@BasitoAro) November 27, 2022