Kanpur Man Threatens Minor: పెళ్లి చేసుకుంటావా.. లేదా ముక్కలుగా నరికేయాలా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kanpur Man Threatens Minor To Kill After She Rejects Marriage Proposal: ప్రేమపేరుతో యువకులు ఉన్మాదులుగా మారుతున్నారు. ఇష్టం లేదని చెప్పినప్పటికీ.. తమని ప్రేమించాల్సిందేనంటూ యువతుల్ని వేధింపులకు గురి చేస్తున్నారు. ఒప్పుకోకపోతే మాత్రం చంపుతామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఓ వ్యక్తి అలాంటి బెదిరింపులకే పాల్పడ్డాడు. తనని పెళ్లి చేసుకోవాలన్న ప్రపోజల్‌ను తిరస్కరించిందన్న కోపంతో.. ముక్కలు ముక్కలు నరికేస్తానని బెదిరించాడు. దీంతో ఆ యువతి పోలీసుల్ని ఆశ్రయించగా.. అతడ్ని అరెస్ట్ చేశారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
కాన్పూర్‌కి చెందిన మహమ్మద్ ఫయాజ్ అనే వ్యక్తి.. కొంతకాలం నుంచి స్కూల్‌కి వెళ్తున్న 17 ఏళ్ల యువతిని ఫాలో అవుతున్నాడు. తనని ప్రేమిస్తున్నానని వేధింపులకు పాల్పడుతూ వచ్చాడు. తనకు ఇష్టం లేదని, తన వెంట పడొద్దని ఆ అమ్మాయి ఎంత వేడుకున్నా.. అతడు వినిపించుకోలేదు. దీంతో.. ఆ యువతి తన కుటుంబ సభ్యులకు విషయం తెలిపింది. గొడవలు ఎందుకులే అనుకొని.. వాళ్లు ఆ అబ్బాయిని మందలించారు. తమ అమ్మాయి జోలికి రావొద్దని, మర్యాదగా చెప్పారు. అయినా అతడిలో మార్పు రాకపోగా.. మరింత రెచ్చిపోయాడు. తనని పెళ్లి చేసుకోవాల్సిందేనని ఆ యువతిని టార్చర్ చేశాడు. అయితే.. ఆ అమ్మాయి ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను పెళ్లి చేసుకోను అని ఒక రోజు ఖరాఖండీగా తేల్చి చెప్పింది.
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
దీంతో కోపాద్రిక్తుడైన ఫయాజ్.. తనని పెళ్లి చేసుకోకపోతే, ముక్కలు ముక్కలుగా నరికేస్తానని ఆ యువతిని బెదిరించాడు. దాంతో భయపడ్డ ఆ యువతి.. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయగా, వాళ్లు పోలీసుల్ని ఆశ్రయించారు. యువతి ఫిర్యాదు మేరకు.. ఫయాజ్‌ను అరెస్ట్ చేశారు. అయితే.. ఫయాజ్‌ను అరెస్ట్ చేసేందుకు ఇంటికి వెళ్లినప్పుడు, అతని పేరెంట్స్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ విషయంపై ఏసీపీ అభిషేక్ కుమార్ పాండే మాట్లాడుతూ.. పోస్కో చట్టం కింద ఫయాజ్‌పై కేసు నమోదు చేశామని, అతడ్ని అరెస్ట్ చేసి జైలుకి పంపామని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
-
Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!